స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్: ప్రభుత్వ చీఫ్ విప్

ABN , First Publish Date - 2021-09-16T00:54:29+05:30 IST

వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్

స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్: ప్రభుత్వ చీఫ్ విప్

హనుమకొండ: వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. నగరంలో జరుగుతున్న 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభ సమావేశానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి వినయ్ భాస్కర్ వచ్చారు. అనంతరం పరుగు పందాన్ని మంత్రులు పరిశీలించారు. వరంగల్‌లో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతామన్నారు.  క్రీడాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.   


పర్యాటక ప్రాంతాలు చూసేందుకు ఉచిత బస్సులు

వరంగల్ జిల్లాలో జాతీయ క్రీడలు జరగడం సంతోషకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వరంగల్లోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు క్రీడాకారులకు ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 

Updated Date - 2021-09-16T00:54:29+05:30 IST