Abn logo
Jan 14 2021 @ 10:16AM

ఉమ్మడి వరంగల్‌లో జాతరల సందడి

వరంగల్ జిల్లా: తెలంగాణలో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతర్లకు భక్తులు పోటెత్తారు. ఐనవోలు మల్లన్న, కొత్తకొండ వీరన్న, ఆలేటి ఎల్లమ్మ సహా పలు జాతర్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. అయితే ఐనవోలులో మొదలైన జాతర ఉగాది వరకు మూడు నెలల పాటు కొనసాగనుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగే జాతర అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది.

Advertisement
Advertisement
Advertisement