టెక్నికల్ ప్రాబ్లమ్‌తో సౌదీలో చిక్కుకున్న ఎన్నారై ఫ్యామిలీ.. ఎట్టకేలకు హైదరాబాద్‌కు..

ABN , First Publish Date - 2022-01-28T02:15:13+05:30 IST

సౌదీ అరేబియా వీసా నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తుందో.. నిబంధనలు ఉల్లఘించిన వారిపట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. వీసా రెన్యువల్ ప్రక్రియలో జరిగిన టెక్నికల్ సమస్య వల్ల తెలం

టెక్నికల్ ప్రాబ్లమ్‌తో సౌదీలో చిక్కుకున్న ఎన్నారై ఫ్యామిలీ.. ఎట్టకేలకు హైదరాబాద్‌కు..

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా వీసా నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తుందో.. నిబంధనలు ఉల్లఘించిన వారిపట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. వీసా రెన్యువల్ ప్రక్రియలో జరిగిన టెక్నికల్ సమస్య వల్ల తెలంగాణకు చెందిన ఓ ఫ్యామిలీ సౌదీ అరేబియాలోనే చిక్కుకుపోయింది. తాజాగా ఆ ఫ్యామిలీ ఇండియాకు బయల్దేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హన్మకొండకు చెందిన రమ్యకృష్ణ కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లైన తర్వాత కూడా భర్తతో కలిసి ఆమె అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గర్భందాల్చింది. దీంతో 2019లో స్వగ్రామానికి వచ్చిన రమ్యకృష్ణ.. అదే ఏడాది సెప్టెంబర్ 30లో కూతురు సమంతకు జన్మనిచ్చింది. తర్వాత విజిట్ వీసాపై కూతురుని తనతోపాటు సౌదీ తీసుకెళ్లింది. ఆ వీసా గడువు తీరిపోయాక.. రెన్యువల్ కోసం అప్లై చేసింది. అయితే టెక్నికల్ సమస్య వల్ల ఆమె సమంత వీసా రెన్యువల్ కాలేదు.



దీంతో అధికారులు సుమారు రూ.6లక్షల ఫైన్ విధించారు. పెద్ద మొత్తంలో ఫైన్ విధించడంతో.. రమ్యకృష్ణ న్యాయపోరాటానికి దిగింది. వీసా రెన్యువల్ కాకపోవడంలో తన వైపు నుంచి ఏ తప్పు లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆమె వాదనను అధికారులు వినిపించుకోలేదు. దీంతో సౌదీలోని స్వచ్ఛంద సంస్థ సాయంతో తాజాగా తన కూతురి వీసా రెన్యువల్ కాకపోడంలో తమ తప్పేమీ లేదని నిరూపించుకుంది. దీంతో ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలోనే భర్త, కూతురితో కలిసి రమ్యకృష్ణ హైదరాబాద్‌కు బయల్దేరింది.




Updated Date - 2022-01-28T02:15:13+05:30 IST