మేడారం భక్తులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-01-11T16:19:28+05:30 IST

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

మేడారం భక్తులకు శుభవార్త

వరంగల్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు వెళ్లేందుకు నేటి నుంచి  ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి పెద్దలకు రూ. 125, పిల్లలకు రూ.65 చార్జీలుగా ఆర్టీసీ నిర్ణయించింది.


ఫిబ్రవరి 16 నుంచి జాతర.....

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం పూనుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి అమవార్లను దర్శించుకోనున్నారు. మరోవైపు మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 3,845 బస్సులను నడుపనుంది. 

Updated Date - 2022-01-11T16:19:28+05:30 IST