వార్డ్‌బాయ్‌గా పనిచేస్తూ ఇదేం పని..!

ABN , First Publish Date - 2020-12-23T21:27:30+05:30 IST

ముంబైలోని ఓ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ పైశాచికంగా ప్రవర్తించాడు. పైల్స్‌కు చికిత్స తీసుకునే నిమిత్తం ఆసుపత్రిలో...

వార్డ్‌బాయ్‌గా పనిచేస్తూ ఇదేం పని..!

మహారాష్ట్ర: ముంబైలోని ఓ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ పైశాచికంగా ప్రవర్తించాడు. పైల్స్‌కు చికిత్స తీసుకునే నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఓ యువతితో అసభ్యంగా వ్యవహరించాడు. మెడిసిన్ అప్లై చేసే నెపంతో ఆమెను తాకరాని చోట తాకి నీచంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని 25 ఏళ్ల ముకేష్‌గా పోలీసులు గుర్తించారు. బాధిత యువతి వయసు 24 సంవత్సరాలు కావడం గమనార్హం. ఘటన జరిగిన స్థలంలో వార్డులోని గదిలో బాధితురాలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించిన సదరు వార్డ్ బాయ్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.



Updated Date - 2020-12-23T21:27:30+05:30 IST