Abn logo
Sep 27 2021 @ 02:41AM

ఆ హాస్పిటల్ లిఫ్ట్‌లోకి అమ్మాయిలు అడుగుపెడితే...

గోవాలోని ఒక ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అస్పత్రికి తరుచూ వచ్చే ఇద్దరు మైనరు అమ్మాయిలను లిఫ్ట్‌లో అతను లైంగికంగా వేధించేవాడని పోలుసులు తెలిపారు.


గోవాలోని మాపూసా నగరంలో నార్త గోవా ఆస్పత్రిలో ఆ ఇద్దరు అమ్మాయిల(13, 14) తల్లి చికిత్స పొందుతూ ఉంది. సెప్టెంబరు 23, 24, 25 తేదీలలో ఆ అమ్మాయిలు ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పనిచేసే వార్డ్ బాయ్ ఈ ఇద్దరు అమ్మాయిలను వెంబడించే వాడని, గత రెండు రోజులుగా వారిపై లైంగికంగా దాడి చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. బాధితుల(ఇద్దరు అమ్మాయిలు) కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 


బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 47 ఏళ్ల ఆ వార్డ్ బాయ్‌ని  పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

ప్రత్యేకంమరిన్ని...