Abn logo
Sep 28 2021 @ 00:55AM

వాన నీటిలో వార్డు సభ్యుడి ధర్నా

నీట మునిగిన ప్రాంతంలో ధర్నా చేస్తున్న వార్డు సభ్యుడు హరినాయుడు

ఎమ్మెల్యే హామీతో ధర్నా విరమణ

ఉండి, సెప్టెంబరు 27:  సోమవారం  తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉండిలోని పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు  చేరింది.  వార్డు సభ్యుడు హరినాయుడు ఉండి కొండ్రోతుపేటను పరిశీలించి  ఆ వర్షపు నీటిలోనే కూర్చుని ధర్నా చేశారు.  సమాచారం తెలుసు కున్న ఉండి ఎమ్మెల్యే  మంతెన రామరాజు  అక్కడకు విచ్చేసి వార్డుసభ్యుడు, ప్రజలతో మాట్లాడారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని, ప్రభుత్వం కూడా నష్టపోయిన వారిని ఆదుకోవాలని అన్నారు. వర్షపునీరు ఇళ్లచుట్టూ చేరిపోవడంతో దోమలు  పెరిగి జ్వరాలు వస్తున్నాయని స్థానిక ప్రజలు, వార్డు సభ్యుడు హరినాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అధికా రులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ ప్రాంతాలలో వున్న సమస్యను పరిష్కరించడానికి తాను కృషిచేస్తానని వారికి హామీ ఇవ్వడంతో ధార్నాను విరమించారు. తక్షణమే కచ్చాడ్రైన్లు త్రవ్వించి నీరు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాలని పంచాయతీకి సూచించారు. ఎంపీపీ శ్రీహరినారాయణరాజు  తదితరులు పాల్గొన్నారు.