ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌వర్మపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-20T04:25:44+05:30 IST

ఉపసర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మపై చర్యలు తీసుకునేంత వరకు నిరసన ఆపేది లేదని గొల్లల కోడేరులో వార్డు సభ్యులు భీష్మించారు.

ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌వర్మపై చర్యలు తీసుకోవాలి
గొల్లలకోడేరులో నిరసన దీక్ష చేస్తున్న వార్డు సభ్యుడు

పాలకోడేరు,జూన్‌ 19 : ఉపసర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మపై చర్యలు తీసుకునేంత వరకు నిరసన ఆపేది లేదని గొల్లల కోడేరులో వార్డు సభ్యులు భీష్మించారు. గొల్లలకోడేరు పంచాయతీ బోర్డు సమావేశంలో ఐదుగురు వార్డుసభ్యుల స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తామని, ఎస్సీ వార్డుసభ్యులను మీరు ఎస్సీలే కాదంటూ అవ మానపరిచిన శ్రీనివాసవర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప క్షంతో గెలిస్తే మా వార్డుల్లో ఇన్‌ చార్జిలను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నియంతలా వ్యవహరిస్తే తగద న్నారు.వార్డు సభ్యులు శనివారం 4వ రోజు వీరవల్లి వేణుగోపాలశ్రీనివాస్‌, కుక్కల బాబూరావు, కరోతి వెంకటలక్ష్మి, దేవబరికిన రత్నకళ, దాసరి ఆనందకుమారి ప్లకార్డులతో ఇంటివద్దే నిరసన చేశారు. 


 


Updated Date - 2021-06-20T04:25:44+05:30 IST