గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములవ్వాలి

ABN , First Publish Date - 2021-09-16T13:45:40+05:30 IST

గ్రామాభివృద్ధిలో వార్డుసభ్యులు భాగస్వాములు కావాలని..

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములవ్వాలి

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ మురళి


బాపట్ల: గ్రామాభివృద్ధిలో వార్డుసభ్యులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ జె.మురళి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతిసభ్యుడికి శిక్షణ ద్వారా తెలియజేయాలని రీసోర్స్‌ పర్సన్‌లకు వివరించారు. బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన రీసోర్స్‌ పర్సన్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 30వేల మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షకులుగా మీరు అత్యంత సమర్థవంతంగా వార్డుసభ్యులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వార్డుసభ్యులంతా తమతమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా శిక్షణ ఇవ్వాలన్నారు. వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో మెడిటేషన్‌ తరగతులు కూడా నిర్వహించాలని చెప్పారు. మెడిటేషన్‌ వల్ల శిక్షణపై ఏకాగ్రత ఎక్కువగా చూపుతారన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారులను నియమించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వెంకట్రావు, ఫ్యాకల్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-16T13:45:40+05:30 IST