యూనిఫాం తీ...నిన్ను చీల్చి చెండాడుతాం...ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు దంపతుల బెదిరింపు

ABN , First Publish Date - 2021-07-10T13:13:09+05:30 IST

కారును అక్రమంగా పార్కింగ్ చేయడమే కాకుండా...పట్టుకున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబులును దుర్భాష లాడుతూ బెదిరించిన దంపతుల బాగోతం...

యూనిఫాం తీ...నిన్ను చీల్చి చెండాడుతాం...ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు దంపతుల బెదిరింపు

సోషల్ మీడియాలో వీడియో వైరల్

థానే (మహారాష్ట్ర): కారును అక్రమంగా పార్కింగ్ చేయడమే కాకుండా...పట్టుకున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబులును దుర్భాష లాడుతూ బెదిరించిన దంపతుల బాగోతం మహారాష్ట్రలోని థానే నగరంలో బయటపడింది. థానే నగరానికి చెందిన అమర్ సింగ్ తన భార్య మీనాసింగ్ తో కలిసి కారులో వచ్చి థానే నగరంలోని మీరా రోడ్డులో నో పార్కింగ్ జోన్ వద్ద అక్రమంగా పార్కింగ్ చేశారు.మీరారోడ్డుపై ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్రమంగా పార్కింగ్ చేసిన కారు చక్రానికి లాక్ చేశారు. అంతే కారు యజమానులైన భార్యాభర్తలు అమర్ సింగ్, మీనాసింగ్ లు పెద్దగా అరుస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను బెదిరించారు.


 ‘‘నీవు పోలీసు యూనిఫాం తొలగించి చెప్పు...నిన్ను చీల్చి చెండాడుతాం’’అని దంపతులు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ పై దాడికి యత్నించి వీరంగం సృష్టించిన దంపతులపై తాము కేసు నమోదు చేశామని థానే ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసుపై దంపతుల వీరంగం వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. 


Updated Date - 2021-07-10T13:13:09+05:30 IST