వార్నర్‌ అవుట్‌

ABN , First Publish Date - 2020-12-01T09:37:22+05:30 IST

వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు నిజంగా ఇది షాకింగ్‌ వార్తే. డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గజ్జల్లో గాయం కారణంగా చివరి వన్డేతో పాటు టీ20 సిరీ్‌సకు కూడా దూరమయ్యాడు.

వార్నర్‌ అవుట్‌

టీ20 సిరీస్‌కు కూడా

కమిన్స్‌కు విశ్రాంతి 


సిడ్నీ: వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు నిజంగా ఇది షాకింగ్‌ వార్తే. డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గజ్జల్లో గాయం కారణంగా చివరి వన్డేతో పాటు టీ20 సిరీ్‌సకు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో డార్సీ షార్ట్‌ను ఎంపిక చేశారు. తొలి రెండు వన్డేల్లో వార్నర్‌ 69, 83 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. అలాగే పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు పని ఒత్తిడి కారణంగా విశ్రాంతినిచ్చారు. దీంతో అతను టెస్టు సిరీ్‌సకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ‘భారత్‌తో జరిగే టెస్టు సిరీ్‌సలో వార్నర్‌, కమిన్స్‌ మాకు అత్యంత కీలకం. కోలుకునేందుకు వార్నర్‌ పునరావాస శిబిరంలో చేరతాడు’ అని ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ తెలిపాడు.

Updated Date - 2020-12-01T09:37:22+05:30 IST