David Warner: శవాలతో రోడ్లపై క్యూలు కట్టడాన్ని చూశా.. నిద్ర పట్టేది కాదు!

ABN , First Publish Date - 2021-06-02T23:08:49+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత్‌లోని పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.

David Warner: శవాలతో రోడ్లపై క్యూలు కట్టడాన్ని చూశా.. నిద్ర పట్టేది కాదు!

ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇటీవల ఇల్లు చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత్‌లోని పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ స‌భ్యులు వీధుల్లో లైన్లు క‌ట్టడం చూశానని, ఆ సన్నివేశాలు చూశాక రాత్రిళ్లు నిద్రపట్టేది కాదని తెలిపాడు. ఆక్సిజన్ కోసం భారతీయులు అల్లాడిపోవడం కళ్లారా చూశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. 


`కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా భారత్‌లో దారుణ పరిస్థితులు తలెత్తాయి. ఆక్సిజన్ కోసం ప్రజలు అల్లాడిపోయారు. క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ స‌భ్యులు వీధుల్లో లైన్లు క‌ట్టడాన్ని హోటల్ నుంచి మైదానంకు వెళ్లేటపుడు చూశా. ఆ సన్నివేశాలు చూశాక రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను ర‌ద్దు చేసి బీసీసీఐ స‌రైన నిర్ణయ‌ం తీసుకుంది. బయో బ‌బుల్‌లో కూడా కేసులు న‌మోదైన త‌ర్వాత ఆటగాళ్లంతా అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌ప‌డతామా? అని ఎదురు చూశార`ని వార్నర్ తెలిపాడు. 

Updated Date - 2021-06-02T23:08:49+05:30 IST