అతనిలో నాకన్నా ఎక్కువ సత్తా ఉంది.. రవిశాస్త్రి ప్రశంస!

ABN , First Publish Date - 2021-03-08T06:01:12+05:30 IST

భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్సులో పంత్‌తో కలిసి జట్టును ఆదుకున్న సుందర్.. 60 పరుగులు చేసి భారత్‌ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు.

అతనిలో నాకన్నా ఎక్కువ సత్తా ఉంది.. రవిశాస్త్రి ప్రశంస!

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్సులో పంత్‌తో కలిసి జట్టును ఆదుకున్న సుందర్.. 60 పరుగులు చేసి భారత్‌ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. వాషింగ్టన్‌ సుందర్‌లో సహజంగానే చాలా సత్తా ఉందని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. ‘‘నా కెరీర్‌లో నాకు ఉన్న సత్తా కన్నా సుందర్‌లో చాలా ఎక్కువ ట్యాంలెంట్ ఉంది. అతను అతని రాష్ట్రానికి ఆడేటప్పుడు టాప్-ఫోర్‌లో ఆడిస్తే బాగుంటుందని భావిస్తున్నా’’ అని శాస్త్రి పేర్కొన్నాడు. అదే సమయంలో సుందర్ తన బౌలింగ్‌పై కూడా దృష్టి పెడితే భారత్‌కు భవిష్యత్తులో అద్భుతమైన ఆరో నంబర్ ఆటగాడు దొరికేసినట్లే అని చెప్పాడు.

Updated Date - 2021-03-08T06:01:12+05:30 IST