మనుషుల ప్రాణాలు తీసే కందిరీగలు.. అమెరికాలో కలకలం..!

ABN , First Publish Date - 2020-10-24T18:13:23+05:30 IST

ప్రాణాలు తీసే కందిరీగలను మీరెప్పుడైనా చూశారా..? తేనెటీగలను చంపగలగడమే కాదు.. ఏడాదికి 50 మంది మనుషులను మట్టుబెట్టగల కందిరీగల గురించి మీరెప్పుడైనా విన్నారా..? ఇప్పటిదాకా జపాన్ వంటి దేశాలకే పరిమితమైన ఈ రాకాసి కందిరీగలు..

మనుషుల ప్రాణాలు తీసే కందిరీగలు.. అమెరికాలో కలకలం..!

వాషింగ్టన్: ప్రాణాలు తీసే కందిరీగలను మీరెప్పుడైనా చూశారా..? తేనెటీగలను చంపగలగడమే కాదు.. ఏడాదికి 50 మంది మనుషులను మట్టుబెట్టగల కందిరీగల గురించి మీరెప్పుడైనా విన్నారా..? ఇప్పటిదాకా జపాన్ వంటి దేశాలకే పరిమితమైన ఈ రాకాసి కందిరీగలు.. ఇప్పుడు అమెరికాలోనూ ప్రత్యక్షమయ్యాయి. వాషింగ్టన్‌లోని బ్లైనే నగరంలో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన పొలంలో శనివారం ఈ రాకాసి కందిరీగలను గుర్తించారు. వీటిని అంతకుముందెప్పుడూ చూడకపోవడం.. వాటి గూడు కూడా ఎండిపోయిన చెట్టు మొదల్లో ఉండటంతో ఆ పొలం యజమానికి అనుమానం వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యవసాయి అధికారులకు సమాచారం ఇచ్చాడు. 


ఈ రాకాసి కందిరీగల గురించి వారికి అంతకుముందే అవగాహన ఉండటంతో వెనువెంటనే వచ్చి పరిశీలించారు.. అవి మనుషులు, తేనెటీగల ప్రాణాలు తీయగలిగే రాకాసి కందిరీగలేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ కందిరీగల గూడును తీసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. బాస్కెట్ బాల్ సైజులో ఉండే ఈ గూడులో వంద నుంచి 200 వరకు రాకాసి కందిరీగలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవి ఇక్కడ ఉండటం తేనెటీగల మనుగడకు ప్రమాదకరమనీ.. ఆదివారం ఈ గూడును తొలగిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2020-10-24T18:13:23+05:30 IST