నాలుగో టెస్టులో సుందర్ సూపర్ ఫీట్!

ABN , First Publish Date - 2021-01-17T21:26:40+05:30 IST

భారత యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఫీట్ సాధించాడు. సీనియర్ ప్లేయర్లు చాలా మంది గాయాలపాలు అవడంతో జట్టులో స్థానం సంపాదించిన సుందర్ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్నాడు.

నాలుగో టెస్టులో సుందర్ సూపర్ ఫీట్!

బ్రిస్బేన్: భారత యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఫీట్ సాధించాడు. సీనియర్ ప్లేయర్లు చాలా మంది గాయాలపాలు అవడంతో జట్టులో స్థానం సంపాదించిన సుందర్ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్నాడు. బంతితో మాయ చేసి మూడు ఆస్ట్రేలియా వికెట్లు కూల్చిన సుందర్.. బ్యాటుతో కూడా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తోటి బౌలర్ సిరాజ్‌తో కలిసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ చేసిన సుందర్ ఓ సూపర్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇలా టెస్టు అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీసి, హాఫ్ సెంచరీ కూడా సాధించిన మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సుందర్ కన్నా ముందు మూడో టెస్టు హీరో హనుమ విహారి ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్‌లో 2018లో జరిగిన టెస్టులో విహారి ఈ ఘనత తన పేరిట రాసుకున్నాడు. అంతకన్నా ముందు 1947లో ఆస్ట్రేలియా సిరీసులో దత్తు ఫాడ్కర్ కూడా ఈ ఘనత సాధించాడు. బ్రిస్బేన్ టెస్టులో సుందర్.. 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోవడంతోపాటు 62 పరుగులు కూడా చేశాడు.

Updated Date - 2021-01-17T21:26:40+05:30 IST