ట్విటర్‌ను షేక్ చేస్తున్న.. సుందర్ 'శునకం' పేరు

ABN , First Publish Date - 2021-04-05T00:52:18+05:30 IST

టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పెంపుడు శునకానికి పెట్టిన పేరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్విటర్‌ను షేక్ చేస్తున్న.. సుందర్ 'శునకం' పేరు

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పెంపుడు శునకానికి పెట్టిన పేరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ట్విటర్ ద్వారా ఈ పెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన సుందర్.. దాని పేరును 'గబ్బా' అని పేర్కొన్నాడు. అంతే.. ఈ ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 38 వేలకు పైగా లైక్స్, 1.6 రిట్వీట్స్ వచ్చాయి. ఇంతకు సుందర్ తన శునకానికి  గబ్బా అనే పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్‌లో ఉన్న గబ్బా స్టేడియం వేదికగా సుందర్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్‌లో సుందర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దాంతో ఈ మైదానంలో గత 32 ఏళ్లుగా టెస్టుల్లో ఓటమి ఎరుగని ఆసీస్ తొలిసారి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మకమైన విజయం సాధించడం.. తనకు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడంతో మ్యాచ్ జరిగిన వేదిక 'గబ్బా' పేరునే తన శునకానికి పెట్టాడు సుందర్. 'వరల్డ్, మీట్ గబ్బా అనే' క్యాప్షన్‌తో సుందర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.     



Updated Date - 2021-04-05T00:52:18+05:30 IST