టీవీలో వాతావరణ వార్తలు..స్క్రీన్‌పైన లైవ్‌లో ఒక్కసారిగా..అమెరికా ప్రజలకు భారీ షాక్!

ABN , First Publish Date - 2021-10-22T04:07:35+05:30 IST

అమెరికాలోని ఓ వార్తా చానల్‌లో అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రసారమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

టీవీలో వాతావరణ వార్తలు..స్క్రీన్‌పైన లైవ్‌లో ఒక్కసారిగా..అమెరికా ప్రజలకు భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్:  అమెరికాలోని ఓ వార్తా చానల్‌లో అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రసారమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వాషింగ్టన్‌లో ఈ ఘటన జరిగింది. కేఆర్ఈఎమ్ చానల్‌లో.. మెటియొరాలజిస్టు మిషెల్ బాస్ వాతావరణ వివరాలు చెబుతోంది. వాషింగ్టన్‌లో రాబోయే రెండు మూడు రోజులు వాతావరణం కాస్తంత వేడిగా ఉంటుందని అని ఆమె చెబుతుండగా.. అకస్మాత్తుగా ఆమె వెనకాల ఉన్న స్క్రీన్‌పై ఒక్కసారిగా అశ్లీల వీడియో ప్లే అవడం ప్రారంభమైంది. అయితే.. ఇవేవీ తెలియని యాంకర్ మాత్రం తన మానాన తాను వార్తలు చదువుకుంటూ వెళ్లిపోయింది. అప్పటికే అప్రమత్తమైన కెమెరామెన్.. కెమెరాను మరో స్క్రీన్‌పై ఫోకస్ పెట్టారు. 


పిల్లలతో పాటూ కుటుంబమంతా టీవీ చూసే సమయంలో ఇలాంటి దృశ్యాలు ప్రసారం కావడం పెను కలకలాన్నే సృష్టించింది. తమ టీవీ స్క్రీన్‌లపై ఇలాంటి దృశ్యం కనిపించడంతో..పలువురు వెంటనే చానల్ వారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దాదాపు.. 13 సెకెన్ల పాటు టీవీలో అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత..టీవీ యాజమాన్యం ప్రజలకు క్షమాపణ తెలిపింది. అయితే..బాస్‌తో ఆమె పక్కనే ఉన్న మరో యాంకర్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక అమెరికా చట్టాల ప్రకారం.. ప్రజలందరూ టీవీల ముందు చేరే సాయంత్రం సమయాల్లో ఇటువంటి దృశ్యాలను ప్రసారం చేయడం నిషిద్ధం. దీంతో.. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఘటనకు గల కారణాలేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-10-22T04:07:35+05:30 IST