Abn logo
Sep 27 2021 @ 23:00PM

వర్షం కోసం జలాభిషేకం

బనగానపల్లె, సెప్టెంబరు 27: మండలంలోని పలుకూరు గ్రామంలో  వర్షం కోసం  రామేశ్వరస్వామికి గ్రామస్థులు, రైతులు కలశాలతో సోమవారం జలాభిషేకం చేశారు. 1008 కలశాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి రామేశ్వరస్వామికి అభిషేకం, రుద్రాభిషేకం పూర్తి చేశారు. కార్యక్రమంలో పూజారి భాస్కరయ్య, కొండయ్య, తిరుపాల్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, గొల్ల నాగేంద్ర  పాల్గొన్నారు.