ప్రధాన జలాశయాలకు జలకళ

ABN , First Publish Date - 2020-09-19T09:55:31+05:30 IST

మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండి గే ట్లను ఎత్తడంతో శీరాంసాగర్‌కు వరద పోటెత్తు తోoది. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి భారీ గా వరద వస్తోంది. గోదావరితో పాటు మంజీరా నుంచి

ప్రధాన జలాశయాలకు జలకళ

ఎస్సారెస్పీకి లక్షా 50వేల క్యూసెక్కుల వరద

40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

జిల్లాలో నిండిన చెరువులు, పారుతున్న వాగులు

కందకుర్తి,  సాలూర వద్ద ఉధృత ప్రవాహం

సింగూరుకు 45 వేల క్యూసెక్కులు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5,645 క్యూసెక్కుల వరద

ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు


నిజామాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండి గే ట్లను ఎత్తడంతో శీరాంసాగర్‌కు వరద పోటెత్తు తోoది. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి భారీ గా వరద వస్తోంది. గోదావరితో పాటు మంజీరా నుంచి కూడా భారీ వరద వస్తుండడంతో ప్రా జె క్టు 40 గేట్ల నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని ది గువకు విడుదల చేశారు. శనివారం ఉదయం వర కు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా నీటిని దిగువ కు వదలారు. మహారాష్ట్రలో గోదావరిపై ఉన్న అ న్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం వల్ల భారీ వరద వ స్తోందని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికా రులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు గోదావరి పరీవాహక ప్రాంతం గ్రామాల వారిని అ ప్రమత్తం చేశారు. గోదావరి వైపు వెళ్లవద్దని కోరా రు. మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాలతో  గో దావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండాయి. గడిచి న కొన్ని రోజులుగా అక్కడి ప్రాజెక్టుల నుంచి నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిపై మహారాష్ట్రలో 102 టీఎంసీల కేపాసిటీ ఉన్న జైక్వాడ్‌ ప్రాజెక్టు గత నెల చివరలలోనే నిండింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నుంచి 30 వేల క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు పై నుంచి వరద వస్తుండటంతో శుక్రవారం ఉదయం లక్ష ఇరవై వేల క్యూసెక్కుల వరదను దిగువకు వి డుదల చేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు విష్ణుపురి, అందూరా, బాలేగాం తో ఇతర ప్రాజెక్టుల నుంచి కూడా వరదను వదిలి పెట్టారు.


అన్ని ప్రాంతాల లో వర్షం పడటం వల్ల జోరుగా అక్కడి ప్రాజెక్టుల లోకి వరద వస్తోంది. ఈ వరద శనివారం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని నాందేడ్‌, ఔరం గబాద్‌ జిల్లాల అధికారులు నిజామాబాద్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తంగా ఉం డాలని ఎస్సారెస్పీ అధికారులను కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో చర్యలు తీసుకోవాలన్నా రు. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతంలో పడు తున్న వర్షాలతో ప్రస్తుతం ప్రాజేక్టులోకి లక్షా పది వేల క్యూసెక్కుల వరదవస్తుండగా లక్షా యాభైవే ల క్యూసెక్కుల వరదను 40 గేట్ల ద్వారాదిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టుకు శనివారం ఉద యం వరకు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వ రద వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరితో పాటు మంజీరా ద్వారా కూడా వరద వస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు ఈ నిర్నయం తీసుకున్నారు.  శ్రీ రాంసాగర్‌కు భారీ వరద వస్తుండడంతో త్రివే ణి సంఘం కందకుర్తి వద్ద గోదావరి, మంజీరా పోటెత్తుతోంది.


ప్రాజెక్టు నిండటంతో బ్యాక్‌ వాటర్‌ ఉండడం వల్ల కందకుర్తి వద్ద నీటి మట్టం పెరుగు తోంది. మంజీరా వైపు నీటిని వెనుకకు నెట్టడంతో పంట పొలాలకు నీళ్లు చేరుతున్నాయి. ప్రాజెక్టు వ రద ఎక్కువగా వస్తుండడం అంతకు అంతకు పె రుగుతుండడంతో అంచనా వేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ఈఈ రామారావు, డీఈ జగదీష్‌లు తెలిపారు. భారీగా వరద వస్తున్నందు న నీటిని దిగువకు వదులుతున్నామని తెలిపారు. మహారాష్ట్ర అధికారుల నుంచి సమాచారం అండ డంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదా వరి, మంజీరాలకు భారీ వరద వస్తున్నందు న అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.నా రాయణరెడ్డి కోరారు. కోటగిరి, బోధన్‌, రెంజల్‌, న వీపేట, నందిపేట, ఆర్మూర్‌, ముప్కాల్‌, ఏర్గట్ల మ ండలాల అధికారులను అప్రమత్తంగా ఉండాల న్నారు. గోదావరి, మంజీరా ప్రాంతాల ప్రజలు పరీ వాహక ప్రాంతాలకు వెళ్లవద్దని కోరారు. 


జిల్లాలో నిండిన చెరువులు 

జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. చెరువుల అ లుగులు పారుతున్నాయి. జిల్లాలో 25 మండలాల లో సగటు వర్షపాతం నమోదు కాగా నాలుగు మ ండలాలలో సగటు వర్షపాతానికిమించి నమో దైం ది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 819 మి. మీ. వర్షం పడాల్సి ఉండగా 850 మి.మీ. వర్షం ప డింది. నవీపేట మండలంలో శుక్రవారం అత్యఽ ధి కంగా 114 మిమీ వర్షం పడింది. జిల్లాలో కురుస్తు న్న వర్షాలతో చెరువులు అలుగులు పారుతున్నా యి. వాగులు పొంగడం వల్ల మెజారిటీ చెరువులు నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,202 చెరువు లు ఉన్నాయి. వీటిలో 243 చెరువులు మత్తడులు పడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పడుతున్న వర్షాలతో 598 చెరువులు పూర్తిగా నిండార ుు. అలుగులు పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగతా చెరు వులలో 75 శాతం వర కు నీళ్లు చేరాయి. జిల్లాలో ప్రస్తుతం పడుతున్న వర్షాల తో చెరువులన్నీ నిండుతున్నా యని జిల్లా నీటి పారుదల శాఖ అధికారిభాను ప్రకాష్‌ తెలిపారు. చె రువులు దెబ్బతినకుండా మండల స్థా యి అధికారులతో ఎప్పటికప్పుడు సమీ క్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. జిల్లాలో ప్రస్తుతం పడుతున్న వర్షా లతో భూగర్భ జలాలు కూడా భారీగా పెరి గాయని ఆయన తెలిపారు.


నిజాంసాగర్‌కు ఆశాజనకంగా వరద 

నిజాంసాగర్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వర ప్రదాయిని అయిన నిజాంసాగర్‌కు వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం క్ర మంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి ప్రాజె క్టులోకి 5,645 క్యూసెక్కుల నీరు చేరింది. నీటిమ ట్టం 1,405 అడుగులకు గాను 1,388 అడుగులకు చేరింది. 17.802 టీఎంసీలకుగాను 4.251 టీఎంసీ లకు చేరింది. అలాగే.. సింగూరు ప్రాజెక్టులోకి 45,200 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రా జెక్టు నీటిమట్టం 523.600 మీటర్లకు గాను 519. 300 మీటర్లకు చేరింది. 29.917 టీఎంసీలకు గా ను 13.025 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథకు 120 క్యూసెక్కుల నీ టిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారా ష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో అర్ధరాత్రి వర కు సింగూరు ప్రాజెక్టు నిండే అవకాశము ంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోచారం, హల్దివాగు, మ ంజీరా నది నుంచి వరద నీరు నిజా ంసాగర్‌ ప్రాజెక్టులో చేరుతోంది. ని జాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి సా మర్థ్యం ఆశాజనకంగా చేరుతో ంది. నిజాంసాగర్‌ లోకి నీరు వచ్చి చేరుతుండడంతో   ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-19T09:55:31+05:30 IST