నీరు.. పారేలా..

ABN , First Publish Date - 2022-01-22T06:37:26+05:30 IST

దాళ్వా పంటలో సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు సన్న ద్ధమవుతున్నారు. మరోవైపు కాల్వ శివారు భూములకు చెందిన రైతులు ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా పంటలను సాగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నీరు.. పారేలా..
అమలాపురం రూరల్‌ బండారులంకలో ఇప్పటికీ దుక్కిదున్నని పొలాలు

  • సాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సన్నద్ధం
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో సాగు చేస్తున్న రైతులు
  • ఈనెల 25 నుంచి వంతులవారీ విధానం అమలు
  • ఇప్పటికీ నీరందక బీడులుగా వందల ఎకరాల భూమి

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

దాళ్వా పంటలో సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు సన్న ద్ధమవుతున్నారు. మరోవైపు కాల్వ శివారు భూములకు చెందిన రైతులు ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా పంటలను సాగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోనసీమవ్యాప్తంగా పలు కాల్వల శివారు భూములకు సాగునీరు అందని సమ స్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులైతే బోర్ల ద్వారా వ్యవసాయా న్ని చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయశాఖ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సెంట్రల్‌ డెల్టాలో సాగునీటి  సమస్య ఉత్పన్నం కాకుండా అవసర మైన ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈనెల 25 నుంచి వంతులవారీ విధానాన్ని సెంట్రల్‌ డెల్టాలోని ఆయకట్టు భూములకు అమలు చేయడం ద్వారా నీటిఎద్దడి నివారణకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లాలో రబీ సాగులో సాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల హెక్టార్ల ఆయకట్టులో దాళ్వా సాగు జరుగుతోంది. దీనిలో ఇప్పటివరకు 1 లక్షా 49 వేల హెక్టార్ల ఆయ కట్టు భూముల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఇక సెంట్రల్‌ డెల్టా పరిధిలోని 14 వేల హెక్టార్ల ఆయకట్టు భూముల్లో నాట్లు వేయా ల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిర్ణీత సమయం కంటే నాట్లు వేయ డంలో ఆలస్యమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవ సాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ విజయ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ మాధవరావులు గురువారం కోనసీమలోని పలు మండ లాల్లో పర్యటించి నాట్లు వేసేందుకు రైతులు చేసుకోవాల్సిన ఏర్పా ట్లపై చర్చించారు. ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెంలో కెనాల్స్‌ను శుభ్రం చేయడం ద్వారా సమీప ఆయకట్టు భూములకు నీరందించడం వల్ల అక్కడ పెండింగ్‌లో ఉన్న 150 ఎకరాల ఆయ కట్టుకు మోక్షం కలగనుంది. రోళ్లపాలెం సమీపంలో శెట్లిపల్లి కాల్వ కింద 500 ఎకరాల ఆయకట్టులో నాట్లు వేయాలని గుర్తించినట్టు అధికారులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసే ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా రైతులకు సూచించినట్టు జేడీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 25 నుంచి సెంట్రల్‌ డెల్టా పరిధిలోని ఆయకట్టు భూములకు వంతులవారీ విధానాన్ని అమలు చేయడానికి ఇరిగే షన్‌ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే మెట్టతోపాటు ఈస్ట్రన్‌ డెల్టాలో నాట్లు వేసే పని పూర్తయినందున సెంట్రల్‌ డెల్టాలోనే ఆయ కట్టు పూర్తి చేసేందుకు వీలుగా వంతుల విధానం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉండగా కోనసీమలోని కొన్ని గ్రామాల్లో సాగు నీరు అందక దుక్కి దున్నని పంట పొలాలు కూడా వందలాది ఎకరా లు ఉన్నాయి. ఉదాహరణకు అమలాపురం రూరల్‌ మండలం బండా రులంక, రోళ్లపాలెం, చిందాడగరువు వంటి అనేక గ్రామాల్లో వందల ఎకరాలు బీడులుగా దర్శనమిస్తున్నాయి. కాగా కొన్నిచోట్ల శివారు ప్రాంత కాల్వలకు సాగునీరు అందడంలేదు. దాంతో రైతులు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అటు బోర్ల ద్వారా ఇంజన్ల సా యంతో వరినాట్లు వేసుకునేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు రబీకి సంబంధించి నాట్ల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారుల అంచనా.

Updated Date - 2022-01-22T06:37:26+05:30 IST