‘ఏలేరు’కు భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2021-09-29T05:46:16+05:30 IST

ఏలేశ్వరం, సెప్టెంబరు 28: ఏలేరు రిజర్వాయర్‌కు పరీవాహక ఎగువ ప్రాంతాల్లో గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు పోటెత్తుతోంది. తూర్పు, విశాఖ ఏజెన్సీ కొండల ప్రాంతం నుంచి భారీగా వస్తున్న ఇన్‌ఫ్లో ప్రభావంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుంటు

‘ఏలేరు’కు భారీగా వరద నీరు
ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు

ప్రాజెక్టులోకి 14300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

గరిష్ట స్థాయికి నీటి నిల్వలు

ఏలేశ్వరం, సెప్టెంబరు 28: ఏలేరు రిజర్వాయర్‌కు పరీవాహక ఎగువ ప్రాంతాల్లో గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు పోటెత్తుతోంది. తూర్పు, విశాఖ ఏజెన్సీ కొండల ప్రాంతం నుంచి భారీగా వస్తున్న ఇన్‌ఫ్లో ప్రభావంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. 86.56మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం 81.81 మీటర్ల స్థాయిలో 15.63 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. మంగళవారం ప్రాజెక్టు ప్రాంతం వద్ద 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా ఎగువ ప్రాంతాల నుంచి అత్యధికంగా 14300 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. గత మూడురోజుల వ్యవధిలో మొత్తం 25,650క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో ప్రాజెక్టులో నీటిమట్టం అనూహ్యంగా పెరుగుదలకు చేరుకుంది. పరీవాహక ప్రదేశం నుంచి ప్రాజెక్టులోకి మరింతగా జలాలు చేరేందుకు అవకాశం ఉన్నందున ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ ప్రాజెక్టు వద్ద రక్షణ చేపట్టారు. ప్రాజెక్టు నుంచి వర్షాల కారణంగా ఆయకట్టు భూములు, విశాఖ నగరానికి, తిమ్మరాజు చెరువుకు, పంపా జలాశయానికి తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేశారు. 

Updated Date - 2021-09-29T05:46:16+05:30 IST