Advertisement
Advertisement
Abn logo
Advertisement

బడిలో నీటి ఊట

   (బొమ్మనహాళ్‌, నవంబరు 27)

బొమ్మనహాళ్‌ జిల్లాపరిషత హైస్కూలు మైదానం నీటికుంటను తలపి స్తోంది. ఊట నీటితో ఆవరణమంతా మడుగులా నిండిపోయింది. దీంతో  హైస్కూలు భవనానికి ప్రమాదం ఏర్పడే అవకాశం వుంది. పాఠశాల చు ట్టూ ఒక వైపు మాగాణి, మరోవైపు రామాలయం వద్ద ఎత్తు ప్రదేశం వుండటంతో భవనాన్ని అప్పట్లో చౌడు భూమిలో నిర్మించారు. దీనివల్లనే నీటి ఊ ట ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు. పాఠశాల మైదానం జలమయమై విద్యార్థుల ఆటలకు, పాఠశాలలోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారింది.  అపరిశుభ్రతతో రోగాలబారినపడే అవకాశం వుంది. నీటి ఊటతో పాత భ వనం ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.               


Advertisement
Advertisement