నీళ్ల గ్లాసు మాయం!

ABN , First Publish Date - 2020-02-24T08:07:40+05:30 IST

ఒక పేపర్‌ కప్పు అడుగు కత్తిరించండి. రెండో పేపర్‌ కప్పు అంచు కత్తిరించండి. అడుగు కత్తిరించిన పేపర్‌ కప్పుని అంచు కత్తిరించిన కప్పులో పెట్టి టేబుల్‌పై పెట్టండి. మీ తలపై టోపీ పెట్టుకోండి.

నీళ్ల గ్లాసు మాయం!

పేపర్‌ బ్యాగులో నుంచి అదృశ్యమైన గ్లాస్‌.. నీళ్లతో సహా టోపీలో దొరుకుతుంది.. ఎలా అంటే..

కావలసినవి:

-రెండు ఒకేరకమైన పేపర్‌ కప్పులు

-ఒక పేపర్‌ బ్యాగు

-నీళ్ల జగ్గు

-టేబుల్‌


ఒక పేపర్‌ కప్పు అడుగు కత్తిరించండి. రెండో పేపర్‌ కప్పు అంచు కత్తిరించండి. అడుగు కత్తిరించిన పేపర్‌ కప్పుని అంచు కత్తిరించిన కప్పులో పెట్టి టేబుల్‌పై పెట్టండి. మీ తలపై టోపీ పెట్టుకోండి. గ్లాసులో నీళ్లు పోయండి. టోపీని తీసి ప్రేక్షకులకు చూపించండి. నీళ్లు నింపిన గ్లాసు అందులో పెట్టండి. పేపరు బ్యాగు తెరిచి దాని అడుగు వెడల్పు చేసి మీ అరచేతిలో పెట్టుకోండి. టోపీలో నుంచి అడుగుభాగం లేని పేపరు కప్పుని నెమ్మదిగా పైకి తీసి నీళ్లు ఉన్న కప్పులా నటించి దానిని అతినెమ్మదిగా పేపరు బ్యాగులో పెట్టండి. ఆ సమయంలో కప్పు అడుగుభాగం లేదని, అందులో నీళ్లు లేవని ప్రేక్షకులకు తెలియకూడదు. ఇప్పుడు కాగితం బ్యాగ్‌పైన మడిచి రెండో చేతితో బ్యాగ్‌ని తట్టి తమాషా చేయండి. ఒక్క నీటి చుక్క కూడా బయటకు రాదు. కాగితం బ్యాగును నలిపి  ప్రేక్షకులకు అందని దూరంలో పారేయండి. అప్పుడు టోపీలోకి తొంగి చూసి అరే గ్లాసు ఇక్కడే ఉంది. ఎక్కడికీ పోలేదు అంటూ గ్లాసు బయటకు తీయండి. గ్లాసులో నీళ్లు జగ్గులో పోయండి.

Updated Date - 2020-02-24T08:07:40+05:30 IST