కవర్లలో జలం... మొక్కకు జీవం

ABN , First Publish Date - 2021-06-22T05:46:05+05:30 IST

కవర్లలో జలం... మొక్కకు జీవం

కవర్లలో జలం... మొక్కకు జీవం

 వానాకాలం సీజన్‌ ప్రారంభం అవడంతో ముందస్తుగా కురిసిన వానలకు కొన్ని చోట్ల రైతులు  దుక్కులు దున్ని విత్తనాలు వేశారు.  అవి మొలకెత్తే సమయానికి వానదేవుడు కరుణించకపోవడంతో  ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు.  వర్షాలు లేక ఎండకు  వాడిపోతున్న పత్తి మొలకలను కాపాడుకునేందుకు మెదడుకు పదును పెట్టాడు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ములమడ గ్రామానికి చెందిన  రైతు నర్సింహులు  పత్తి మొలకలను కాపాడుకునేందుకు వాటి వద్ద ప్లాస్టిక్‌ కవర్లలో నీటిని నింపి ఇలా తన పంటను కాపాడుకుంటున్నాడు.

  -(ఆంధ్రజ్యోతి వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)

Updated Date - 2021-06-22T05:46:05+05:30 IST