Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాగులు వంకల్లో నీటి పరవళ్లు

కొండుగారిపల్లె వద్ద పోరుమామిళ్ల చెరువుకు సంబంధించి గేట్లను ఎత్తివేస్తున్న రెవెన్యూ అధికారులు

రహదారులు జలమయం 

బయనపల్లె చెరువుకు గండి

స్తంభించిన రాకనోకలు

అప్రమత్తమైన అధికారులు

 సుమారు పది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల చెరువులు, వాగులు, వంకలు, అలుగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పట్లో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. బద్వేలు లక్ష్మీపాళెంలో ఇదివరకే నిండుకుండల్లా ఉన్న పెద్ద చెరువు ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలతో అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా రఘునాధపురం, తిరువెంగళాపురం గ్రామాల ప్రధాన రహదారులు జలమయమవడంతో రెండు గ్రామాల ప్రజలు గ్రామం దాటి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని దుండగులు బయనపల్లె చెరువుకు గండికొట్టినట్లు  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలం గానుగపెంట పాత బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి తీగలేరు వాగు ఉధృతం గా ప్రవహిస్తుండడంతో దాదాపు 8 వేల మంది ప్రజానీకం రాకపోకలు స్థంభించాయి. చెరువులు, కుంటలు నిండి వాగులు పారుతుండడంతో అఽధికారులు అప్రమత్తమయ్యారు. పోరుమామిళ్లలో దమ్మనపల్లె, కొండుగారిపల్లెల వద్ద  గేట్లను ఎత్తివేయించి ప్రమాదం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వివరాల్లోకెళితే....

పోరుమామిళ్ల, నవంబరు 30: కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగులు పా రుతుండడంతో అఽధికారులు అప్రమత్తమయ్యారు. పోరుమామిళ్ల చెరువు దాదాపు అలుగు పారే పరిస్థి తి ఏర్పడడంతో దమ్మనపల్లె, కొండుగారిపల్లెల వద్ద ఆర్‌ఐ సిద్దేశ్వరయ్య, వీర్వో ఓబులేసు, సూపరింటెండెంట్‌ రమణమ్మ, సిబ్బంది గేట్లను ఎత్తివేయించి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొత్తూరు చెరువు అలుగు పారింది. ముసలిరెడ్డిపల్లె - కొరపాటిపల్లె రోడ్లపై నీరు ప్రవహించింది. సాయంత్రం కూడా వర్షాలు ప్రారంభం కావడంతో అధికారులు అన్ని చెరువులను పరిశీలించి జాగ్రత్తచర్యలు చేపడుతున్నారు. 

సర్పంచ్‌ చొరవతో పూడికతీత 

 రంగసముద్రం సర్పంచ్‌ చిత్తా రవిప్రకా్‌షరెడ్డి చొరవతో పూడికతీత పనులు చేయడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిచి ఉన్న వర్షపు నీరు బయట ప్రాంతాల కు వెళ్లిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్‌ చుట్టుపక్కల వీధులు నీటితో నిండిపోయాయి. అక్కడ ఉన్న షాపుల్లో నీరు ప్రవేశించింది. బస్సుల రాకపోకలు కూడా ఇబ్బంది ఏర్పడడంతో సర్పంచ్‌ చిత్తా రవిప్రకా్‌షరెడ్డి చొరవతో డ్రైనేజి పూడిక తీతపనులు పైన మూతలను తొలగించి పూడిక తీయడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.

ఆయన మాట్లాడుతూ ప్రజలు కాల్వల్లో ప్లాస్టిక్‌ సీ సాలు, కవర్లు వంటివి వేయకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగునీరు పారేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పం చాయతీ సిబ్బంది ద్వారా చెత్తకుండీలను ఉపయోగించి వ్యర్థాలను చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు సహాయపడాలన్నారు. రంగసముద్రం పంచాయతీల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జేసీబీలతో మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజీవ్‌రెడ్డి, యువజననాయకుడు చిత్తా గిరిప్రణీత్‌రెడ్డి, రాజారెడ్డి, నాగేంద్రరెడ్డి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని సహాయ చర్యలు చేపట్టారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాశినాయన నవంబరు30: సగిలేరు సహా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు తొందరపడి నీటిలోకి దిగవద్దని తహసీల్దారు రవిశంకర్‌, ఆర్‌ఐ మోహన్‌రాజు హెచ్చరించారు. చెన్నవరం చెరువు, సగిలేరు లోలెవల్‌ బ్రిడ్జి, ఉప్పాగును పరిశీలించి కాపలా సిబ్బందిని అప్రమత్తంచేశారు. చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయని దాటుకోవాలని ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దన్నారు. ఇప్పటికే ఆయాగ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

కొట్టుకుపోయిన గేదె, దూడ

బ్రహ్మంగారిమఠం, నవంబరు 30: మేతకు వెళ్లిన గేదె, దూడ వాగులో కొట్టుకుపోయాయని రైతు గొడ్లవీటి శివారెడ్డి తెలిపారు.  ఉదయం ఇంటినుం చి మేత కోసం వెళ్లిన గేదె, దూడ మధ్యాహ్నం ఇం టికి రాలేదు. అప్పటికే చౌదరివారిపల్లె సమీపంలో పలుగురాళ్లపల్లె దారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్ర వహిస్తోంది. దీంతో  పశువుల యజమాని వాగు వద్దకు వెళ్లి వెతకడంతో వాగులో కొట్టుకుని వెళ్లిన ట్లు గ్రామస్థులు తెలిపారని శివారెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనకు సాయం చేయాలని కోరారు. 

ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాల్వల్లో పూడికతీత తీయిస్తున్న చిత్తా రవిప్రకా్‌షరెడ్డి


చెన్నవరం చెరువు అలుగును పరిశీలిస్తున్న తహసీల్దారు రవిశంకర్‌


చెన్నవరం అలుగును పరిశీలనలో తహసీల్దారు


Advertisement
Advertisement