జల రాజకీయం

ABN , First Publish Date - 2021-06-24T04:41:10+05:30 IST

ఏపీ ప్రభుత్వం తొండి చేస్తూనే ఉన్నది..

జల రాజకీయం
జూరాల ప్రాజెక్టు (ఫైల్‌)

- ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ముదురుతున్న వివాదం

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం

- అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

- ఏడాది తరువాత స్పందించిన సీఎం చంద్రశేఖర్‌రావు

- జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి సూచనలు

- చిత్తశుద్ధిని శంకిస్తున్న పాలమూరు ప్రజలు

- నేడు ఆర్డీఎస్‌ ముట్టడికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ పిలుపు


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఏపీ ప్రభుత్వం తొండి చేస్తూనే ఉన్నది.. కృష్ణ తుంగభ్రద నదుల నుంచి దశాబ్దాలుగా నీటి దోపిడీకి పాల్పడుతూనే ఉన్నది.. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను విస్తరించడంతో పాటు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించింది.. తాజాగా ఆర్డీఎస్‌ నుంచి అక్రమంగా నీటి తరలింపునకు కుడి వైపున కొత్త కాల్వను నిర్మిస్తోంది.. అక్కడి ప్రభుత్వం చేస్తున్న ఈ జల దౌర్జన్యంపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా భగ్గుమంటోంది.. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఏపీ సర్కారుపై విమర్శలు చేస్తూ, పాలమూరు నుంచే ప్రజాయుద్ధం చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.. కృష్ణ, తుంగభద్ర నదీ జలాల వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ నాయకులు నిజంగానే అడ్డుకుంటారా? లేక రాజకీయ పబ్బం గడుపుకొని రాబోయే ఎన్నికలకు మరో ఎజెండాగా మార్చుకుంటారా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాను ఆనుకొని కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు ప్రవహిస్తున్నాయి. చెంతనే మూడు నదులు న్నా, ఆ నీటిని ఇక్కడి భూములకు తరలించే పరిస్థితి లేక, ప దేళ్ల కిందటి వరకు కరువు కాటకాలే రాజ్యమేలాయి. రాజోలి బండ  మళ్లింపు (ఆర్డీఎస్‌) పథకం ద్వారా వచ్చే కాల్వ కింద న డిగడ్డ (జోగుళాంబ గద్వాల)లోని అలంపూర్‌ నియోజకవర్గం లో దాదాపు 85 వేల ఎకరాలకు తొలుత నీరందేది. క్రమేపీ అ ది తగ్గుతూ 30 వేల ఎకరాలకు పరిమితమైంది. ఈ నేపథ్యం లో సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ద్వారా జూరాల ప్రాజెక్టు, ఆ తర్వాత భీమా రెండు దశలు, కోయిల్‌సాగర్‌, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్‌ఐ) పథకాలను జిల్లా సాధిం చుకుంది. అదే సమయంలో ఆర్డీఎస్‌ రైతుల ప్రయోజనాల ప రిరక్షణార్థం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటి దశ పూర్తి చేసుకోవడంతో, ఆయకట్టుకు నీటి భరోసా కలి గింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్‌ఎల్‌ ఐ) పథకం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లు జల వివాదానికి కారణమవుతున్నాయి. కృష్ణానది పై శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌ ఆధారంగా ఏపీ ప్రభుత్వం నూతనంగా సంగమేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌ను చేపడు తోంది. అలాగే 44 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులరేటర్‌ను 80 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచే పనులను కొనసాగిస్తోంది. అయితే, శ్రీశై లం బ్యాక్‌వాటర్‌ నుంచి పాలమూరుకు చెందిన ఎంజీకేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐలకు 820 అడుగుల నీటి మట్టం నుంచే నీటిని సే కరించే నిర్మాణాలుంటే, పోతిరెడ్డిపాడు విస్తరణను ఏపీ ప్రభు త్వం 800 అడుగల నీటిమట్టమున్నా నీటిని తరలించేలా నిర్మి స్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో చుక్క నీరున్నా పోతిరెడ్డిపా డు నీళ్లు తరలిపోతాయి. అలాగే తుంగభద్ర నదిపై ఆర్డీఎస్‌ నుంచి కుడి కాల్వను తవ్వే పనులను కూడా ఏపీ సర్కార్‌ శ రవేగంగా చేస్తోంది. ఈ కాల్వ నిర్మాణం జరిగితే ఎడమ వైపున ఉన్న మన కాల్వకు నీరందడం గగనమే అవుతుంది.

తాజాగా నెలకొన్న జల వివాదంపై, ఏడాది కాలం త రువాత సీఎం కేసీఆర్‌ ఏపీ కుట్రలకు ధీటుగా స్పందిం చారు. కృష్ణానదిపై వనపర్తి-జోగుళాంబ గద్వాల జిల్లాల మధ్యలో గొందిమళ్ల-వెల్టూరు వద్ద జోగులాంబ బ్యారేజీ నిర్మాణాన్ని తెరమీదకు తెచ్చారు. అయితే, ఈ బ్యారేజీ ని ర్మాణం సర్వే దశలు దాటి, నిర్మాణ పనులు చేపట్టడానికి చాలా సమయం పడుతుంది, ఈలోగా ఏపీ ప్రభుత్వం అక్రమంగానే తమ ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకునే ప్రమాద మూ ఉంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంటే, ఈ వి వాదాన్ని రాజకీయం చేసిన అధికార, ప్రతిపక్షాలు తాము ప్రజల కోసం పోరాడుతున్నామంటే, కాదు తామే నికార్స యిన ప్రజాపక్షమంటూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఏపీ ప్రభుత్వంపై సవాళ్లు, విమర్శలు, ప్రతివిమర్శలు చే స్తున్నారు. గత సోమవారం హైదరాబాద్‌లో జరిగిన వి లేకర్ల సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. పాలమూరు ను ఎండబెట్టాలనే వ్యూహాలను అడ్డుకుంటామని హెచ్చ రించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రె డ్డి కూడా పలు సందర్భాల్లో ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఘా టుగా స్పందించారు. ఇటీవల ఆర్డీఎస్‌ కుడి కాల్వ నిర్మా ణంపై అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం స్పందిస్తూ ఏపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అలాగే మంగళవా రం పాలమూరులో పర్యటించిన హౌసింగ్‌ శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి దూకుడు వైఖరితో వైఎస్‌ఆర్‌ని నీటి దొంగ గా, ఆయన కుమారుడు జగన్‌ని గజదొంగగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి, ఏపీ ప్రభుత్వం దారికి రాక పోతే పాలమూరు నుంచే ప్రజాయుద్ధం మొదలు పెడతామని మంత్రులు ప్రకటించడం వేడి రేపింది. ఒక వైపు మంత్రుల ఘాటు వ్యాఖ్యలతో వేడెక్కిన పరిస్థితిలో తాజాగా కాంగ్రెస్‌ నా యకులు సంపత్‌ కుమార్‌ ప్రకటించిన కార్యాచరణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు వాడివేడి ఎంతవరకు కొనసాగిస్తారు..? మీడియా ప్రకటనలు, వాదోపవాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలకే పరిమితమవుతారా? ఏపీ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునేంత వరకు చిత్త శుద్ధితో పోరాడుతారా? అనే సందిగ్థత ప్రజల్లో, ప్రజాసంఘాల నాయకుల్లో కనిపిస్తోంది.

Updated Date - 2021-06-24T04:41:10+05:30 IST