అచట.. నీటి కటకట!

ABN , First Publish Date - 2021-06-21T04:33:07+05:30 IST

ఇదీ వానాకాలం! తాగునీటికి అంతగా ఇబ్బందిపడ కూడని కాలం! కానీ కొత్తూరు, గుర్రాలచెరువులో పరిస్థితి ఇందుకు భిన్నం! భూగర్భజలాలు మెండుగా ఉన్నా మోటార్లు సరిగ్గా నడవవు. ఒకవేళ నడిచినా పదిహేను రోజులకోమారు పాడవుతుంటాయి. ఇలా జరిగినప్పుడల్లా గ్రామస్థులంతా తాగునీటి కోసుల దూరం ప్రయాణించాలి. ఇంటిల్లిపాది బిందెలతో నీటిని తెచ్చుకొంటే తప్ప అవసరాలు తీరవు. ప్రభుత్వ ఆర్భాటంగా ప్రకటించుకొంటున్న భగీరథ నీరు చివరి ఇళ్లకు సరఫరా కావడం లేదు. వచ్చే ఆ కొద్దీ నీరు కూడా ఇటీవల పూర్తిగా నిలిచిపోయింది. ఇటు మోటార్లు నడవక, అటు భగీరథ నీరు రాక.. ప్రజలు నరకం చూస్తున్నారు. పోనీ పాడయిన మోటార్ల స్థానంలో కొత్తవి కొందామంటే భగీరథ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి.

అచట.. నీటి కటకట!
పల్లెప్రకృతి వనం వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులు

మోటార్లు బాగుండవు

భగీరథ నీరు అందదు

కొత్త మోటార్ల కొనుగోలుకు నిబంధనల అడ్డు

బిందెడు నీటికి కోసుల దూరం ప్రయాణం

ఇదీ కొత్తూరు, గుర్రాలచెరువులో పరిస్థితి

అధికారులకు విన్నవించినా ప్రయోజనం శూన్యం

అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్‌, జూన్‌ 20: ఇదీ వానాకాలం! తాగునీటికి అంతగా ఇబ్బందిపడ కూడని కాలం! కానీ కొత్తూరు, గుర్రాలచెరువులో పరిస్థితి ఇందుకు భిన్నం! భూగర్భజలాలు మెండుగా ఉన్నా మోటార్లు సరిగ్గా నడవవు. ఒకవేళ నడిచినా పదిహేను రోజులకోమారు పాడవుతుంటాయి. ఇలా జరిగినప్పుడల్లా గ్రామస్థులంతా తాగునీటి కోసుల దూరం ప్రయాణించాలి. ఇంటిల్లిపాది బిందెలతో నీటిని తెచ్చుకొంటే తప్ప అవసరాలు తీరవు. ప్రభుత్వ ఆర్భాటంగా ప్రకటించుకొంటున్న భగీరథ నీరు చివరి ఇళ్లకు సరఫరా కావడం లేదు. వచ్చే ఆ కొద్దీ నీరు కూడా ఇటీవల పూర్తిగా నిలిచిపోయింది. ఇటు మోటార్లు నడవక, అటు భగీరథ నీరు రాక.. ప్రజలు నరకం చూస్తున్నారు. పోనీ పాడయిన మోటార్ల స్థానంలో కొత్తవి కొందామంటే భగీరథ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి.

మండలంలోని గుమ్మడివల్లి పంచాయతీలోని కొత్తూరులో పక్షం రోజులుగా ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మోటారు మరమ్మతులకు గురికావటం, మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ప్రజల పాలిటశాపంగా మారింది. సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అడ్డుగా మారటంతో ప్రజలు బిందెడు నీటికోసం పరుగులు పెడుతున్నారు. 

చివరి ఇళ్లకు సరఫరా కాని భగీరథ నీరు

కొత్తూరులో దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి మిషన్‌ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నా అవి ఏనాడూ సరిపోవడం లేదు. అధికారులు తమ లెక్కల ప్రకారం నీటిని విడుదల చేస్తుండడం, అవి చివరి ఇళ్లకు సరఫరా కాకపోవటంతో ప్రజలు తమకు మిషన్‌ భగీరథ నీరు వద్దంటూ మొరపెట్టుకుంటున్నారు. ఈ నీరు సరిపోకపోవడంతో గ్రామంలో ఉన్న మోటారు ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే పదిహేను రోజుల క్రితం మోటారు పాడయింది. అప్పటి నుంచి గ్రామంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇదే తరుణంలో అరకొరగా వచ్చే మిషన్‌ భగీరథ నీరు ఆగిపోయింది. ఇటు ఉన్న మోటారు పనిచేయకపోవటం, అటు మిషన్‌ భగీరఽథనీరు రాకపోవటంతో గ్రామంలో ప్రజల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కొందరు నీటికోసం ప్రల్లెప్రకృతి వనం వద్ద ఉన్న మోటారు వద్దకు, మరికొందరు చేతిపంపులు, బావుల వద్దకు వెళ్తున్నారు. కరోనా నేపథ్యంలో అందరూ నీటి కోసం ఒకేచోటకు వెళ్తుండటం మరింత ఇబ్బందిగా మారుతోంది.

మోటారు కొనేందుకు అడ్డుగా నిబంధనలు

కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా తయారైంది మిషన్‌ భగీరథ నీటి పథకం తీరు. గ్రామాలకు సరఫరా అయ్యే భగీరఽథ నీరే అన్ని గ్రామాలకు దిక్కుగా ఉంటోంది. గతంలో పంచాయతీల్లో ఉన్న మోటార్లు ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అవి ఒకవేళ పాడ యితే కొత్తవి కొనుగోలు చేసేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇదే జరుగుతోంది. పక్షం రోజుల క్రితం పాడైన మోటారుకు మరమ్మతులు చేయా లని గ్రామస్థులు కోరగా.. వారం క్రితం బయటకు తీసి మెకానిక్‌ వద్దకు పంపారు. అది బాగైతే సరి.. లేదంటే కొత్త మోటారును బిగించాలి. కానీ పంచాయతీలకు మోటారు కొనుగోలు చేసి ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటున్నాయి. మోటార్లకు పంచాయతీ నిధులు వినియోగించవద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడ మే ఇందుకు కారణం. దీంతో గ్రామపంచాయతీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రభుత్వ నిబంధనలు, మిషన్‌ భగీరథ పథకం పనితీరు గ్రామస్థుల పాలిటశాపాలుగా మారాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొత్త మోటారును ఏర్పాటు చేస్తే తప్ప ప్రజల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. 

తాగునీటి సమస్య ఉంది

బాబు, పంచాయతీ కార్యదర్శి

కొత్తూరులో తాగునీటి ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. మోటారు పాడవడంతో మరమ్మతులకు పంపాం. కొత్త మోటారు కొనాలంటే నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. రెండు నెలల క్రితమే ఇబ్బందులు పడి మోటారును బిగిం చాం. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడతాం.

గుర్రాలచెరువులోనూ నీటికి కటకట

మండలంలోని గుర్రాల చెరువులో రెండు రోజులుగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి అమర్చిన మోటారు పాడవడంతో సుమారుగా 200 పైగ కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలోని ప్రజలు నీటికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల తేడాలోనే అనేక మార్లు మో టారు పాడయిందని.. అది జరిగినప్పుడల్లా నాలుగైదు రో జుల పాటు తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షిత తాగునీటి పథకానికి అమర్చిన మోటారు తరుచూ పాడవుతుండటంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసేటప్పుడు నాణ్యత కలిగిన సామగ్రిని వినియోగించకపోవడంవల్లే ఈ విధంగా జరుగుతోందని అం టున్నారు. ప్రస్తుం సర్పంచ్‌ కలపాల దుర్గయ్య ఆధ్వర్యంలో ట్యాంకర్‌ ద్వారా నీటిని గ్రామస్థులకు సరఫరా చేస్తున్నారు. 


Updated Date - 2021-06-21T04:33:07+05:30 IST