రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-03-02T05:10:55+05:30 IST

మండలంలో వరి రైతుకు సాగునీటి కష్టాలు తప్పట్లేదు.

రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
ఏలూరుపాడు వద్ద ఇంజన్‌లు ఏర్పాటు చేసుకుంటున్న రైతులు

కాళ్ళ, మార్చి 1: మండలంలో వరి రైతుకు సాగునీటి కష్టాలు తప్పట్లేదు. దాళ్వా ప్రారంభ దశలోనే ఈవిధంగా ఉంటే తరువాత పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాపాడుకునేందుకు రైతన్నలు నానా కష్టాలు పడుతున్నారు. ఏలూరుపాడు రెండో నెంబర్‌ డ్యామ్‌ పరిధిలో సుమారు 50 ఎకరాలకు సాగునీరు అందక చేలు బీటలు వారాయి. వంతుల వారీ విధానంలో కాలువకు పూర్తిస్థాయిలో సాగునీరు రాకపోవడంతో ఆయకట్టు పరిధిలోని పలువురు రైతులు సొంత సొమ్ముతో వెంకయ్య వయ్యేరు పంట కాలువలో ఆయిల్‌ ఇంజన్‌లు ఏర్పాటు చేసుకుని సాగు నీటిని తోడుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధిక వర్షాలు కారణంగా ఖరీఫ్‌ పంట పూర్తిగా పాడైపోయిన తరుణంలో రబీలో నీటి కోసం అదనపు ఖర్చు రైతన్నకు మరింత భారమైందని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తే రైతన్న కొంత కోలుకుంటారని పలువురు రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-03-02T05:10:55+05:30 IST