తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-22T05:21:22+05:30 IST

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం జగన్‌ రూ.28 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

 మంత్రి కన్నబాబు 

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 21: కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం జగన్‌ రూ.28 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నేమాంలో గ్రామ సర్పంచ్‌ రాందేవు సూర్యప్రకాశరావు (చిన్న) ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ జలజీవన్‌ పథకంలో రూ. 2కోట్ల నిధులతో ఎస్సీ పేట, చుట్టుగుంట పాలెం, గుత్తులవారిపాలెం ప్రాంతాల్లో నిర్మించనున్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణం, పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నేమాంలో రూ.108 కోట్లతో ఓహెచ్‌ఆర్‌ నిర్మించి తాగునీరు అందిం చామన్నారు.  రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఇంటిం టికీ అన్ని ప్రాంతాలకు తాగునీరందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జడ్పీటీసీలు ను రుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ గోపిశెట్టి పద్మజగోపి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సీహెచ్‌ కృష్ణారెడ్డి, డీఈ కె.శ్రీదేవి, ఏఈ బీవీ మారుతీరామ్‌, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, తహశీల్దార్‌ వి.మురార్జీ, గ్రామ కార్యదర్శి నాగవేణి పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-22T05:21:22+05:30 IST