అసోంలో pakistan.... వెల్లువెత్తిన ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-12T18:40:01+05:30 IST

ఎగువ అసోంలోని ధేమజీ జిల్లాలో ఓ నీటి సరఫరా ప్రాజెక్టుకు 'పాకిస్తాన్' పేరుపెట్టడం దుమారం..

అసోంలో pakistan.... వెల్లువెత్తిన ఆగ్రహం

గౌహతి: ఎగువ అసోంలోని ధేమజీ జిల్లాలో ఓ నీటి సరఫరా ప్రాజెక్టుకు 'పాకిస్తాన్' పేరుపెట్టడం దుమారం రేపింది. ప్రాజెక్ట్ నేమ్‌ప్లేట్‌ నుంచి 'పాకిస్తాన్' అనే పదం తొలగించాలంటూ పబ్లిక్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌ (పీహెచ్‌ఈ)పై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. గతంలో ఉన్న పేరు క్రమంగా మరుగున పడి, కాలక్రమంలో వాడుకలోకి వచ్చిన పేరే ఈ వివాదానికి కారణం. ఒకప్పుడు ఈ ప్రాంతానికి 'పాక్ స్తాన్ సుక్' అని ఉండేది. క్రమంగా అది...పాకిస్తాన్ సుక్‌గా ప్రచారంలోకి వచ్చింది. ఏళ్ల తరబడి ఇదే పేరు ప్రచారంలో ఉంది. అధికారిక డాక్యుమెంట్లలోనూ ఇదే పేరు ఉంది. దీంతో వాటర్ ప్రాజెక్టుకు 'పాకిస్తాన్ సుబ' వాటర్ సప్లై స్కీమ్ అని పేరు పెట్టారు.


ప్రాజెక్టు నేమ్‌ప్లేట్‌లోని 'పాకిస్తాన్' పేరును సామాజిక కార్యకర్త బీర్ లచిత్ సేన గత బుధవారంనాడు చెరిపేశారు. గత రెండు రోజులుగా ఈ విషయంపై దుమారం రేగుతున్నప్పటికీ పీహెచ్ఈ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనిపై థేమజీ సబ్ డివిజనర్ అధికారి నందిత రాయ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి  'పాక్ స్తాన్ సుక్' అనేది ఒరిజనల్ పేరని, పూర్వీకులు అలా పేరు పెట్టుకున్నప్పటికీ క్రమంగా 'పాకిస్తాన్ సుక్'గా వాడుకలోకి వచ్చిందని, అధికార రికార్డుల్లోనే అలాగే ఉందని చెప్పారు. ఒకప్పుడు ఇది అంతగా వాడుకలో లేని ప్రదేశమని, అహోం, చుటియా కమ్యూనిటీకి చెందిన వారే నివసించే వారని, ముస్లింలు ఎవరూ ఉండేవారు కాదని చెప్పారు. 1992 నుంచి తమ రికార్డుల్లో పాకిస్తాన్ సుక్ పేరే ఉందన్నారు. పాకిస్తాన్ అనే పేరు శాశ్వతంగా తొలగించడానికి కొన్ని విధివిధానాలు పాటించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఈ వివాదంపై పీహెచ్‌ఈ మంత్రి రంజీత్ కుమార్ దాస్ తాజాగా స్పందించారు. సమస్య తన దృష్టికి వచ్చిందని, సరైన చర్య తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

Updated Date - 2021-11-12T18:40:01+05:30 IST