ఆకివీడులో తాగునీటికి కటకట

ABN , First Publish Date - 2021-05-04T05:14:24+05:30 IST

: ప్రశ్నించే పాల కులు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు.

ఆకివీడులో తాగునీటికి కటకట
ఖాళీగా ఫిల్టర్‌ బెడ్‌

 అందుబాటులోకి రాని ఫిల్టర్‌బెడ్‌

ఆకివీడు,మే 3 : ప్రశ్నించే పాల కులు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. ప్ర జలకు సమస్యలు సృష్టిస్తున్నారు. లేని ఇబ్బందులను తెచ్చిపెడుతు న్నారు. ఈ సంఘటనే ఉదా హర ణ. ఆకివీడు తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఫిల్టర్‌ బెడ్‌లో ఇసుక మార్చి మూడు రోజులు దాటుతున్నా ఇంత వరకూ నీళ్లు పెట్టలేదు. దీంతో నగరవాసులు తాగునీటికి కటకటలా డుతున్నా రు. ఒక ప్రణాళిక ప్రకారం వేసవికి ముందే తాగునీటి ఫిల్టర్‌బెడ్‌ల పనులు చేయాలి. అయితే ఆకివీడులో మాత్రం వేసవి ముందు ప్రారంభించారు. ఇప్ప టికి నెల రోజులు దాటినా నేటికీ నీరు నింపలేదు. ఫిల్టర్‌బెడ్‌లో నీరు పెట్టకపోవడంతో స్థానిక భుజబలరాయుడు ట్యాంకు నుంచి రోజుకు సుమారు 20 ట్యాంకర్ల నీరు తరలిపోతోంది. ఇదేవిధంగా నీరు తరలిపోతే మే చివరి నుంచి తాగునీటి సమస్య ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-04T05:14:24+05:30 IST