వన్యప్రాణులకు నీటి సదుపాయం

ABN , First Publish Date - 2021-03-05T05:42:23+05:30 IST

వన్యప్రాణులకు నీటి సదుపాయం

వన్యప్రాణులకు నీటి సదుపాయం
మర్పల్లి: కల్కోడ ఫారెస్టులో ఏర్పాటు చేసిన నీటితొట్టి

మర్పల్లి/బంట్వారం:  వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు మండల పరిధిలోని కల్కోడ ఫారెస్టులో మూడు నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారి ఎస్‌కే.ఫరీద్‌ తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి తొట్టెలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా బంట్వారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అడవిలో ఉన్న వన్యప్రాణుల తాగునీటి కోసం నీటితొట్టెలు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ సెక్షన్‌ అధికారి ఎస్‌కే.ఫరీద్‌ తెలిపారు. గురువారం ఆయన ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి నీటితొట్టెలో నిల్వచేయించారు. 

Updated Date - 2021-03-05T05:42:23+05:30 IST