Abn logo
Oct 30 2020 @ 04:26AM

రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) :  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలలో శనివారం నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. కృష్ణా ఫేజ్‌-2, 1400 ఎంఎం డయా మెయిన్‌ రింగ్‌-1 పైపులైన్‌కు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు మరమ్మతు పనులు జరగనున్నాయి. దీంతో మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌజ్‌, కాకతీయనగర్‌, హుమాయున్‌నగర్‌, తల్లాగడ్డ, ఆసి్‌ఫనగర్‌, ఎంఈస్‌, షేక్‌పేట్‌, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌ నగర్‌ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్‌హిల్స్‌, సచివాలయం, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, గగన్‌మహల్‌, హిమయత్‌నగర్‌, బుద్వేల్‌, హైదర్‌గూడ, రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, సులేమాన్‌నగర్‌, ఎంఎం పహాడి, అత్తాపూర్‌, చింతల్‌మెట్‌, కిషన్‌బాగ్‌, గంధంగూడ, కిస్మత్‌పూర్‌ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement