Abn logo
Sep 25 2021 @ 23:25PM

నీటి ట్యాంకులు శభ్రంగా ఉంచాలి

నీటి ట్యాంకును పరిశీలిస్తున్న కమిషనర్‌ డీఈ, ఏఈ

ప్రొద్దుటూరు అర్బన్‌ సెప్టెంబరు 25: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే నీటి ట్యాంకులు, సంపులను సకాలంలో శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కమిషనర్‌ వెంకట శివారెడ్డి వాటర్‌ వర్స్‌ అధికారులకు సూచించారు. శనివారం కమిషనర్‌ డీఈ దస్తగిరితో కలిసి ఆర్ట్స్‌ కాలేజీ , అనిబిసెంట్‌ హైస్కూలు, టీబీబంగ్లా ,బొల్లవరం లోని నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు విడుదల చేసే రోజులు వీధులను కూడా బోర్డుపై రోజు ప్రదర్శింపజేయాలని సూచించారు. ఏఈ పాల్గొన్నారు.