Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం : టీడీపీ

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు30:జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న తీవ్ర నీటిఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా  నీరందిస్తున్నామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం ఆయన నీటిఎద్దడి ప్రాంతాలకు ట్యాం కర్లను పంపించి తాగునీరందించారు.  ఈ సందర్భంగా భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ మంచినీటి సమస్య ఉన్నా తమకు తెలిపితే తమ వద్ద ఉన్న ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. గూడెంచెరువు రాజీవ్‌నగర్‌ కాలనీకి తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

బోర్లు కొట్టుకుపోవడంతో సమస్య: కాగా నగర పంచాయతీ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తమను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ పెన్నానది వరదల కారణంగా నదిలో వేసిన బోర్లు కొట్టుకునిపోవడంతో నగర పరిధిలో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా బోర్లు ఉన్న వారితో మాట్లాడి సమస్యలు లేకుండా చేశామన్నారు. దూరప్రాంతాల వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement