నీరుగారుతున్న లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-24T04:54:37+05:30 IST

స్వచ్ఛభారత్‌ లక్ష్యంలో భాగంగా తడిపొడి చెత్త సేకరణ చేసి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరుగా మార్చడమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి.

నీరుగారుతున్న లక్ష్యం
మానవపాడు మండలం, పోతులపాడు గ్రామంలో డంపింగ్‌యార్డులో కాలిపోతున్న చెత్తచెదారం

 అలంపూర్‌ చౌరస్తా, జనవరి 23 : స్వచ్ఛభారత్‌ లక్ష్యంలో భాగంగా  తడిపొడి చెత్త సేకరణ చేసి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరుగా మార్చడమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి. నిర్వహణ లేక లక్ష్యం నీరుగారుతోంది. పంచాయతీలకు ఆదాయం అందించాల్సిన డంపింగ్‌ యార్డులు  ఆదనపు భారంగా మారాయి. ఎరువుగా మారాల్సిన తడిపొడి చెత్త యార్డుల పక్కనే కాలిబుడిదవుతున్నది. రికార్డుల్లో ఉన్న వానపాములు సెగ్రిగేషన్‌లో కనిపించడం లేదు.   తనిఖీల పేరిట వచ్చే ఉన్నతాధికారుల బాధ్యతారహిత్యమే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

చెత్త సేకరణ ఇలా..  

జోగుళాంబ గద్వాల జిల్లాలో తడిపొడి చెత్త సేకరణ కోసం ఏడాదిన్నర క్రితం ఇంటింటికి రెండు  చెత్తబుట్టలను ఆందజేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అయా గ్రామ పంచాయతీలలో సుమారు 15 లక్షల బుట్టలు పంపిణీ చేశారు. స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పాటు చేస్తూ పంచాయతీలకు ఆదాయ వనరుగా మార్చలన్నదే వీటి ముఖ్యోద్దేశ్యం. కానీ ఇంటింటికి ఇచ్చిన బుట్టలను తడిపొడి చెత్తకు ఉపయోగించాల్సి ఉన్నా 85 శాతం మేర ఇతర అవసరాలకు వాడటం ఆవగహనలోపంగా పరిగణించవచ్చు. ఇదేది కాకుండానే రోజు చెత్త సేకరించేందుకు ట్రాక్టర్లను తిప్పడంతో వాటి డీజిల్‌కే  నెల కు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చెత్త తరలించే ట్రాక్టర్‌ వచ్చినప్పుడు తడిపొడి అన్న తేడా లేకుండా ఆందజేస్తున్నారు. ఇలా సేకరించిన అన్ని రకాల చెత్తను టాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డులలో ఆన్‌లోడ్‌ చేయడంతోనే లక్ష్యానికి ముగింపు పలుకుతున్నారు. 

సెగ్రిగేషన్‌ ఏది..?  

  గ్రామ పంచాయతీలకు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులతో  సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. జిల్లాలో 255 పంచాయతీలకు పూర్తి స్థాయిలో సెగ్రిగేషన్‌ షెడ్లు ఉన్నాయి. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు 64 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు. కానీ వీటి వల్ల ఇంతవరకు ఏ గ్రామ పంచాయతీకి నయాపైసా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు.   ముఖ్యంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో వదిలేస్తారు. అక్కడి నుంచి తడిపొడి చెత్తను, వివిధ రకాల వేస్టేజ్‌ను వేరు చేసి సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డుకు తరలించాలి. అక్కడ తడి చెత్తను ప్రత్యేకంగా నిర్మించిన నాడేపు కంపోస్ట్‌ పిట్‌లో ఉంచి వాటిలో వానపాములు వదలాలి. ఆ తర్వాత ప్రతీ రోజు తగిన మోతాదులో తడపాలి.  45 రోజుల తర్వాత అది ఎరువుగా మారుతుంది. దీనిని హరితహారం మొక్కలకు, అయా గ్రామాల్లో ఆసక్తి గల రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయం పొందవచ్చు. కానీ ఈ పక్రియ ఎక్కడ జరగడంలేదు.   

Updated Date - 2022-01-24T04:54:37+05:30 IST