వర్షానికి జలమయమైన ఆత్మకూరు

ABN , First Publish Date - 2021-10-23T06:12:17+05:30 IST

మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జా మున కురిసిన భారీ వర్షానికి ఆత్మకూరు మేజర్‌ పంచాయతీ వీధులు జల మయమయ్యాయి.

వర్షానికి జలమయమైన ఆత్మకూరు
ప్రధాన వీధిలో వర్షపునీటిలో నిలిచిపోయిన బస్సు

ఆత్మకూరు అక్టోబరు22 : మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జా మున కురిసిన భారీ వర్షానికి ఆత్మకూరు మేజర్‌ పంచాయతీ వీధులు జల మయమయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు , ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఆరుగంటలకే   తెగి పోయిన చెరువు నుంచి పెద్ద ఎత్తున వర్షపునీరు రావడంతో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న బస్సు ప్రధాన రోడ్డుపై నిలిచి పోయింది. కాసేపు ప్రయాణికులు ఆందోళన చెందారు. వారిని స్థానికులు రక్షించారు. వర్షపు నీరు అధికమవడంతో బయటకు రాలేకు ఓ కుటుంబం బస్సులోనే నిలిచి పోయింది. కొద్దిసేపు ఆ దంపతులు పిల్లలతో బిక్కు బిక్కు మంటూ గడి పారు. చివరికి ఎలాగోలా బయట పడ్డారు. రోడ్డుకు పక్కనే ఓ రైతు గోడ కట్టడంతో వర్షపునీరు ఎక్కడికీ వె ళ్లలేక సమీప ఎస్సీ కాలనీ, రెడ్డి కాలనీ, సర్దార్‌వలి దర్గా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు తా త్కాలికంగా... ఎంపీడీఓ కార్యాలయ సమీపాన రూ. 10లక్షలతో గతంలో ని ర్మించిన చెక్‌డ్యాంను ఎక్స్‌కవేటర్‌తో పెకలించారు. దీంతో కొంత ఉపశమ నం లభించింది. 15 ఏళ్లుగా వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నట్లు ఎస్సీ కాలనీ, దర్గా కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

శాశ్వత పరిష్కారం చూపాలని వినతి

మండల కేంద్రంలో వర్షపు నీటితో కాలనీలు జలమయ మయ్యాయి. దీంతో సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందించేందుకు వెళ్లిన ప్రజలపై ఎంపీడీఓ రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కాలనీల వాసులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి కాలనీల్లో వర్షపు నీరు నిల్వలేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వీరికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. కాలనీల్లోకి నీరు రాకుండా శాశ్వత పనులు చేయకుండా... తాత్కాలికంగా రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెక్‌ డ్యాంను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. దానికి ఎవరు మరమ్మతులు చేస్తారని అడిగారు. దీనిపై ఎంపీడీఓ నా యిష్టం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చెక్‌డ్యాం మర మ్మతు పనులు చేయించేలా చర్యలు తీసుకుంటామని మిగిలిన అదికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు. ఎస్సీ కాలలోని వర్షపునీరు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని టీడీపీ నాయకులు అధికారులను కోరారు. 


Updated Date - 2021-10-23T06:12:17+05:30 IST