వావ్... ఇరవై మంది దగ్గర... 463 బిలియన్ డాలర్లు

ABN , First Publish Date - 2020-12-03T22:48:30+05:30 IST

ఇది నిజమే. మరి వీరెవరంటే... ఆసియాలో అగ్రస్థానంలో ఉన్న 20 మంది కుబేరులు. భారత కరెన్సీలో ఇది రూ. 34 లక్షల కోట్లకు పైగానే. వివరాలిలా ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 74 బిలియన్ డాలర్లు(అతని సంపద దాదాపు రూ.6 లక్షల కోట్లు). అంటే ఆసియాలోని టాప్ 20 మందిలో ఉన్న సంపదలో 17 శాతం అంబానీ వద్దే ఉంది.

వావ్... ఇరవై మంది దగ్గర... 463 బిలియన్ డాలర్లు

ముంబై : ఇది నిజమే. మరి వీరెవరంటే... ఆసియాలో అగ్రస్థానంలో ఉన్న 20 మంది కుబేరులు. భారత కరెన్సీలో ఇది రూ. 34 లక్షల కోట్లకు పైగానే. వివరాలిలా ఉన్నాయి.  రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 74 బిలియన్ డాలర్లు(అతని సంపద దాదాపు రూ.6 లక్షల కోట్లు). అంటే ఆసియాలోని టాప్ 20 మందిలో ఉన్న సంపదలో 17 శాతం అంబానీ వద్దే ఉంది. ఆయన ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలోను చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.


హంగ్‌కాంగ్‌కు చెందిన వోక్ ఫ్యామిలీ కంటే ముఖేష్ అంబానీ కుటుంబం ఆస్తుల ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువగా ఉంటాయి. ఆసియాలో రెండో ధనిక ఫ్యామిలీ వీరిదే కావడం గమనార్హం. శాంసంగ్ అధినేత, దక్షిణ కొరియాకు చెందిన కుబేరుడు లీ ఫ్యామిలీ సంపద కంటే అంబానీ కుటుంబం ఆస్తి మూడు రెట్లు ఎక్కువ. ఇక కరోనా మహమ్మరి నేపధ్యంలో వివిధ రంగాలు, వ్యక్తలు తీవ్రంగా ప్రభావితం కాగా... అదే సమయంలో అంబానీ ఆస్తులు భారీగా పెరగడం గమనార్హం. జియో, రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం, జియో కస్టమర్లు వేగంగా పెరగడం ఇందుకు దోహదపడింది. ఇక... చమురు రంగం నుండి టెలికం, రిటైల్ సహా వివిధ రంగాల్లో ఉన్న ముఖేష్ అంబానీ తమ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులను ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే. 


పెట్టుబడుల వెల్లువ... 

ప్రముఖ డిజిటల్ ఈక్విటీ సంస్థలు కేకేఆర్, టీపీజీలతో పాటు టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థల నుండి జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. జియో ప్లాట్‌ఫాంలోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్ రిటైల్‌లోకి నిధుల సేకరణ కోసం మరోసారి ఫండ్‌రెయిజింగ్ ప్రారంభించారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ రిటైల్‌లో 10.09 శాతం వాటా విక్రయం ద్వారా ఇప్పటి వరకు రూ. 47 వేల కోట్ల మేరకు సమీకరించారు. భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో రిలయన్స్ షేర్ ఈ ఏడాది భారీగా పెరిగింది. అయితే ఇటీవల రూ. 2,300 దాటిన స్టాక్ ఇప్పుడు రూ. రెండు వేల దిగువకు పడిపోయింది.


పదహారు బిలియన్ డాలర్లు అప్...

రిలయన్స్ స్టాక్ భారీగా జంప్ చేయడంతో ముఖేష్ ఆస్తి కూడా ఈ ఏడాది 16 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆసియా టాప్ 20 లోని ధనికుల సంపద మధ్య భారీ అంతరమేర్పడింది. ఆయన సోదరుడు అనిల్ అంబానీ ప్రస్తుతం అఫ్పుల్లో కూరుకుపోయారు. మరోవైపు... ముఖేష్ సంపద మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఈ జాబితాలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ జాక్‌మా వంటి ఫస్ట్ జనరేషన్ బిలియనీర్లను లెక్కలోకి తీసుకోలేదు. అందుకే చైనా నుండి ఈ జాబితాలో ఎవరూ చోటుచేసుకోలేదు. అయినప్పటికీ... జాక్ ఆస్తుల కంటే ముఖేష్ అంబానీ ఆస్తి అధికం కావడం గమనార్హం.

Updated Date - 2020-12-03T22:48:30+05:30 IST