Abn logo
Jul 21 2021 @ 20:14PM

వావ్... అమూల్ మిల్క్... ‘టర్నోవర్’ రికార్డ్...

ఆనంద్(గుజరాత్) : దేశంలోనే అతిపెద్ద పాల బ్రాండ్ అముల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,248 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.  ఇక... 2025 నాటికి ఆదాయాన్ని రెట్టింపు (రూ. లక్ష కోట్లు) చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది ఎనిమిదవ అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ. తొమ్మిదేళ్ళ క్రితం(2012 లో) ఇది 18 వ స్థానంలో ఉంది.


వాస్తవానికి, కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో... ఇళ్లలో పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. ఈ కారణంగా సంస్థ వ్యాపారం తారస్థాయిలో పెరిగింది. దాని మొత్తం సభ్యులు 2021 లో పాల సేకరణలో 14 % వృద్ధిని సాధించారు. ఇది రోజుకు 40 లక్షల లీటర్ల పాలను నిర్వహిస్తుంది.