కరోనా తీవ్రత కొలిచేది ఇలా!

ABN , First Publish Date - 2020-04-14T05:55:57+05:30 IST

‘ప్రతి వ్యాధి వ్యాప్తికీ ఓ పరిధి ఉంటుంది. దాన్ని లెక్కించే విధానమూ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి పది మందికి జబ్బును అంటిస్తే దాన్ని...ఆర్‌ ‘10’ అంటారు. కరోనా వ్యాధి విషయంలో వైరస్‌ సంక్రమించే తీవ్రత ‘ఆర్‌ - 3 నుంచి ఆర్‌ - 5’...

కరోనా తీవ్రత కొలిచేది ఇలా!

‘ప్రతి వ్యాధి వ్యాప్తికీ ఓ పరిధి ఉంటుంది. దాన్ని లెక్కించే విధానమూ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి పది మందికి జబ్బును అంటిస్తే దాన్ని...ఆర్‌ ‘10’ అంటారు. కరోనా వ్యాధి విషయంలో వైరస్‌ సంక్రమించే తీవ్రత ‘ఆర్‌ - 3 నుంచి ఆర్‌ - 5’ వరకూ ఉంది. అంటే... జనసాంద్రతను బట్టి, కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి ఆ వైరస్‌ ముగ్గురి నుంచి ఐదుగురికి సోకుతోంది. అలాగే ఏ అంటువ్యాధి అయినా తొలుత లక్షణాల రూపంలో బయల్పడిన తర్వాతే, ఇతరులకు సోకుతుంది.


అంటే, అప్పటికే ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి ప్రబలడానికి సరిపడే స్థాయికి వైరల్‌ లోడ్‌ చేరుకుని ఉంటుంది. కానీ కరోనా విషయంలో లక్షణాలు బయల్పడే లోపే, వైరల్‌ లోడ్‌ ఇతరులకు సోకే స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా 14 రోజుల ఇంక్యుబేషన్‌ పీరియడ్‌లోనే వైరస్‌ సోకిన వ్యక్తికి తెలియకుండానే ఎంతోమందికి ఈ వ్యాధి సోకుతోంది. వీరి ద్వారా ఇంకొందరికి వైరస్‌ సోకుతోంది. ఈ వ్యాధి ఇంతలా విస్తరించడానికి కారణం ఇదే!


Updated Date - 2020-04-14T05:55:57+05:30 IST