మంత్రి హరీష్‌రావు సవాల్‌కు మేము సిద్ధమే

ABN , First Publish Date - 2020-10-21T06:00:04+05:30 IST

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు చేసిన సవాల్‌ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు వేదిక, తేదీ ఎక్కడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మంత్రి హరీష్‌

మంత్రి హరీష్‌రావు సవాల్‌కు మేము సిద్ధమే

బహిరంగ చర్చకు వేదిక, తేదీ చెప్పండి  

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ 


 కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 20: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు చేసిన సవాల్‌ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు వేదిక, తేదీ ఎక్కడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మంత్రి హరీష్‌ రావుకు ప్రతిసవాల్‌ విసిరారు. మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షు డు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తప్పదని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీ కార్యకర్తల వాహనాలను ప్రచారం చేయకుండా అడ్డుకుంటూ కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. పార్టీ సోషల్‌ మీడియా చూసే వంశీ అనే కార్యకర్త వాహనాన్ని ఒకేరోజు రెండుసార్లు టైర్లు, డోర్లు ఊడదీసి, మ్యాట్‌ తీసి చెక్‌ చేశారని, చెక్‌ చేయడాన్ని తప్పుబట్టడం లేదని, అయితే ఇలాంటి ఎత్తుగడలు, కుట్రలు చేసినా ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. సిద్దిపేటలోగానీ, దుబ్బాకలోగానీ, మంత్రి కార్యాలయంలోగానీ బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని, అక్కడ కేంద్ర ప్రభు త్వం రాష్ట్రానికి ఇస్తున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, పీఎం ఆవాస యోజన, క్రిషీ వికాస్‌ యోజన పథకం కింద ఇచ్చిన నిధులు, రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా, అంగన్‌వాడీల్లో శిశువులకు పౌష్టికాహారం కోసం ఇచ్చే వాటా, మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చిద్దామని అన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణాలు, గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం కోసం ఇస్తున్న సబ్సిడీ లపై, హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ వైద్యశాలలకు ఇస్తున్న నిధులపై కూడా చర్చి ద్దామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరానికి సాగునీరు అందించేందుకు ఎంత ఖర్చవుతుందో కూడా మంత్రి హరీష్‌ చెప్పాలని, వీటన్నిటిపై చర్చించేం దుకు సిద్ధమేనని, తమ ప్రతిసవాల్‌ను స్వీకరించాలని లేనిపక్షంలో ఓటమిని అంగీకరిస్తున్నట్లు బీజేపీ భావిస్తుందని అన్నారు.  

Updated Date - 2020-10-21T06:00:04+05:30 IST