మేముసైతం పరిసరాల పరిశుభ్రతలో..

ABN , First Publish Date - 2020-05-18T10:10:34+05:30 IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‘ఆది వారం ఉదయం పది గంటలు, పదినిమిషాల’ పిలుపున కు ఉమ్మడి జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు.

మేముసైతం పరిసరాల పరిశుభ్రతలో..

మంత్రి కేటీఆర్‌ పిలుపునకు స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

వృథానీటి తొలగింపు.. డ్రెయినేజీల్లో పూడిక తీత 8 ప్రజలూ పాటించాలని పిలుపు


ఖమ్మం కలెక్టరేట్‌/ సత్తుపల్లి/ఇల్లెందు టౌన్‌/మధిర టౌన్‌, మే 17: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‘ఆది వారం ఉదయం పది గంటలు, పదినిమిషాల’ పిలుపున కు ఉమ్మడి జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆదివారం ఉదయం పది గంటల పది ని మిషాలకు కార్యాలయాల్లో వృథా నీటిని తొలగించారు. డ్రెయి నేజీల్లో పూడికను తీశారు. 


పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలి

 వ్యక్తిగతంతో పాటు ఇంటి పరిసరాల పరిశుభ్రతను విధి గా పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పిలుపునిచ్చా రు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం రాష్ట్ర పుర పాలక శా ఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ తన నివాసంలో పూలకుండీలను శు భ్రపరిచారు. వృధానీటిని తొలగించారు. ప్రతి వ్యక్తి తమ ఇళ్లలోని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాల ని కలెక్టర్‌ కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు కనీసం 10 నిమిషాల పాటు ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


రోగాలు దూరం

 పరిసరాల పరిశుభ్రతతో రోగాలు వ్యాపించవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన ‘ప్రతి ఆదివారం-పది గంటలకు-పది నిమిషాలు’ కార్యక్రమంలో భా గంగా ఆదివారం పట్టణంలో మురుగు కాలువలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూ సంపూడి మహేష్‌, జిల్లా నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ పాల్గొన్నారు.


రీ ట్విట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

ఎమ్మెల్యే సండ్ర కాలువను శుభ్రం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన చిత్రాలను ట్విట్టర్‌ కౌన్సిలర్‌ అమరవరపు విజయనిర్మల కుమారుడు వరప్రసాద్‌ పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భం గా స్పందించిన మంత్రి కేటీఆర్‌ లైక్‌ చేస్తూ రీ ట్విట్‌ చేశారు.


ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్ర త పాటించాలని మధిర మునిసిపల్‌ ఇన్‌చార్జ్‌ క మిషనర్‌ డి.సైదులు కోరారు. ఆదివారం మధిర ము నిసిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ముని సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మే రకు ఆదివారం ఉద యం 10.10 గంటల కార్యక్రమంలో భాగంగా డ్రమ్ములు, గాబుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్ర మం లో కౌన్సిలర్‌ రజిని పాల్గొన్నారు.


ఇల్లెందులోని పలు వార్డులో..

ఆదివారం ఇల్లెందు పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆదివారం 10 గం టలు 10నిమిషాల కార్యక్రమం వి స్తృతంగా నిర్వహించారు. వార్డుల్లో నీటి తోట్లను శుభ్రం చేయడంతోపా టు పారుశుధ్యపనులను చేపట్టారు. ఈ కార్యక్రమం లో చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు, కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T10:10:34+05:30 IST