కంపు భరించలేకున్నాం

ABN , First Publish Date - 2021-06-24T04:27:37+05:30 IST

డంపింగ్‌ యార్డు నుంచి వెదజల్లుతున్న దర్వాసనతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కంపు భరించలేకున్నాం
చేనేత వర్క్‌షెడ్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డు

- చేనేత వర్క్‌షెడ్‌ సమీపంలో  

డంపింగ్‌ యార్డు ఏర్పాటు

- దుర్వాసనతో కార్మికుల అవస్థ

- కలెక్టర్‌ ఆదేశించినా తొలగించని మునిసిపల్‌ అధికారులు

అమరచింత, జూన్‌ 23: డంపింగ్‌ యార్డు నుంచి వెదజల్లుతున్న దర్వాసనతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణ సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఎదురుగా అమరచింత సిల్క్‌ హ్యాండ్లూ మ్‌ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆధ్వర్యంలో రూ. 55లక్షలతో నిర్మించిన చేనేత వర్క్‌షెడ్‌ భవనంలో 48మగ్గాలను ఏర్పాటు చేసి  కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.  దానికి సమీపంలోనే మునిసిపాలిటీ ఆధ్వర్యంలో డం పింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు మునిసి పాలిటీ సిబ్బంది చెత్తా చెదారాన్ని తెచ్చి యార్డులో వేస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. దాంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడు తున్నారు.   మూడు నెలల కిందట  కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, హ్యాండ్లూమ్‌ భవనాన్ని పరిశీలించేందుకు రాగా, కార్మికులు తమ గోడును వినిపించారు. డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో పని చేసుకోలేకపో తున్నామని యార్డును మరో చోటకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో కలెక్టర్‌, ఎమ్మెల్యే స్పందించి మునిసిపల్‌ అధికారులకు యార్డును మరో  చోటకు తరలించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు మునిసిపల్‌ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా ఉన్నతాధికారి ఆదేశించినా మునిసిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో పనులు చేసుకోలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా నేతకార్మికుల అవస్థను దృష్టిలో ఉంచుకొని డంపింగ్‌ యార్డును మరో చోటకు మార్చాలని కార్మికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-24T04:27:37+05:30 IST