పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-01-24T04:15:23+05:30 IST

దొంగతనం చేసిందనే అనుమానంతో దళిత మహిళను చితగ్గొట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై, ఫిర్యాదు చేసిన జైలు సూపరింటెండెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

మదనపల్లె క్రైం, జనవరి 23: దొంగతనం చేసిందనే అనుమానంతో దళిత మహిళను చితగ్గొట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై, ఫిర్యాదు చేసిన జైలు సూపరింటెండెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. చిత్తూరు జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న దళిత మహిళ ఉమామహేశ్వరి  దొంగతనం చేసిందనే అనమానంతో వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి చితగ్గొట్టిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన యమలా సుదర్శన్‌ ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. గాయపడిన మహిళ కుటుంబానికి స్టేషన్‌ నుంచి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇప్పించి, ఆమెకు రక్షణ కల్పించాలని కోరారు.  

Updated Date - 2022-01-24T04:15:23+05:30 IST