వీఐపీ సంస్కృతికి చోటివ్వలేదు...ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-22T16:23:06+05:30 IST

కొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ క‌ల్చ‌ర్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు....

వీఐపీ సంస్కృతికి చోటివ్వలేదు...ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ క‌ల్చ‌ర్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.130 కోట్ల మంది భారతీయులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల కృషి తర్వాత ఈ మైలురాయిని సాధించామని మోదీ చెప్పారు.శుక్రవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై దాడికి దిగారు.వ్యాక్సినేష‌న్ సంపూర్ణంగా సైంటిఫిక్ ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ స‌మంగా చూశామ‌ని, 100 కోట్ల టీకా మైలురాయిని సాధించినందుకు భారతీయులను మోదీ అభినందించారు. 


‘‘ఈ రోజు చాలా మంది ప్రజలు భారతదేశ కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు.భారతదేశం 100 కోట్ల కరోనా టీకా మార్కును దాటిన వేగం  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు.కరోనా మహమ్మారి ప్రారంభంలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమనే భయాలు వ్యక్తమయ్యాయి.ఇంత సంయమనం, అంత క్రమశిక్షణ ఇక్కడ ఎలా పని చేస్తాయనేది ఈ టీకా కార్యక్రమం ద్వారా భారతదేశ ప్రజలకు కూడా చెప్పాం’’అని మోదీ చెప్పారు. ‘‘దేశం ‘అందరికీ టీకా’  నగదు రహిత వ్యాక్సిన్ అనే ప్రచారాన్ని ప్రారంభించాం.వాక్సిన్ పంపిణీలో పేద-ధనిక, గ్రామం-నగరం, సుదూర అనే తేడా లేకుండా దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదు’’అని మోదీ చెప్పారు. 




నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించామని, స్టార్టప్‌లలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనడం, స్థానికంగా భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు.‘‘మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతీయుడు చెమటోడ్చి తయారుచేసిన చిన్న వస్తువును కొనుగోలు చేయాలని  నేను దేశ ప్రజలను కోరుతున్నాను. ఇది అందరి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యమవుతుంది.’’ అని మోదీ వివరించారు. 


Updated Date - 2021-10-22T16:23:06+05:30 IST