Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 17:40PM

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి

సూర్యాపేట : ముషంపల్లి బాధిత కుటుంబానికి ప్రభుత్వం, మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఐద్వా తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా మహిళా ఉద్యమ ఛాయా చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను.. సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఐద్వా ఆలిండియా నాయకురాలు జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వరుస సంఘటనలు.. బాధాకరమన్నారు.


మన మధ్యనే మన మనుషులుగా తిరుగుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాలని చూస్తే మానవత్వం మంట కలుస్తుందనే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లితండ్రులు ఆడ పిల్లలను వివక్ష లేకుండా సమానత్వంతో పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు పార్టీలు, సంఘాలకతీతంగా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటన జరిగిన వెంటనే మహిళా కమిషన్ స్పందించిందని గుర్తు చేశారు. స్థానిక ఎస్పీతో మాట్లాడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement