‘ధోనీ వ్యూహం’తో ముందుకెళ్లాం..

ABN , First Publish Date - 2020-12-04T09:06:08+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వ్యూహం చక్కగా పనిచేసిందని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. 152/5 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్న దశలో జడ్డూ-హార్దిక్‌ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులందించారు...

‘ధోనీ వ్యూహం’తో ముందుకెళ్లాం..

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వ్యూహం చక్కగా పనిచేసిందని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. 152/5 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్న దశలో జడ్డూ-హార్దిక్‌ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులందించారు. ‘ధోనీ నాన్‌ స్ట్రయికర్‌తో చక్కటి భాగస్వామ్యం నమోదు చేయాలనుకుంటాడు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడడం అతడి శైలి. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాక డెత్‌ ఓవర్లలో భారీ పరుగులు సాధించాలని ధోనీ చెప్పేవాడు. అదేరీతిలో హార్దిక్‌, నేను కూడా మూడో వన్డేలో చర్చించుకుని చివరి ఓవర్లలో చెలరేగుదామనుకున్నాం. ఒక వైపు బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండడం కూడా మాకు కలిసి వచ్చింది’ అని జడేజా తెలిపాడు.


Updated Date - 2020-12-04T09:06:08+05:30 IST