పూర్తిస్థాయిలో ఇసుక ఇస్తాం : జేసీ

ABN , First Publish Date - 2020-07-09T10:36:20+05:30 IST

ఇసుక కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారం దరికీ పూర్తిస్థాయిలో అందిస్తామని జేసీ కె.వెంకట రమణారెడ్డి తెలిపారు. ఇసుక ర్యాంప్‌ నిర్వాహకులతో ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

పూర్తిస్థాయిలో ఇసుక ఇస్తాం : జేసీ

కొవ్వూరు, జూలై 8: ఇసుక కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారం దరికీ పూర్తిస్థాయిలో అందిస్తామని జేసీ కె.వెంకట రమణారెడ్డి తెలిపారు. ఇసుక ర్యాంప్‌ నిర్వాహకులతో ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 4 రోజుల్లో 3.5 లక్షల టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్నారన్నారు. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ పనులకు ఇసుకను అధికంగా సరఫరా చేయాల్సి వస్తుందన్నారు.


నెల రోజుల ముందు 3.57 లక్షల టన్నుల బ్యాక్‌లాగ్‌ ఇసుక సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2.6 లక్షల టన్నులకు తగ్గిందన్నారు. ప్రతి రోజూ 25 వేల టన్నుల ఉత్పత్తి చేస్తున్నప్పటికి ఆర్డర్లు కూడా అదేవిధంగా వస్తున్నా యన్నారు. ఏడెనిమిది రోజుల్లో బ్యాక్‌లాగ్‌ను పూర్తి చేస్తామన్నారు. డంపింగ్‌ యార్డులలో 7 లక్షల టన్నులు నిల్వ ఉంచామని వాటి  నుంచి సీఎం ఆదేశాల మేరకు ఇప్పటివరకు ఇసుక నమోదు చేసుకున్న వారందరికి నేరుగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుం డా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఆర్డీవో లక్ష్మారెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, శాండ్‌ అధికారి కేవీవీ సత్యనారాయణ  పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T10:36:20+05:30 IST