టిక్‌టాక్‌పై ఆసక్తి లేదు..యాపిల్

ABN , First Publish Date - 2020-08-06T00:30:55+05:30 IST

టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్న ఆసక్తి తమకు లేదని ప్రముఖ కంపెనీ యాపిల్ స్పష్టం చేసింది.

టిక్‌టాక్‌పై ఆసక్తి లేదు..యాపిల్

వాషింగ్టన్: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్న ఆసక్తి తమకు లేదని ప్రముఖ కంపెనీ యాపిల్ స్పష్టం చేసింది.  టిక్‌టాక్‌ కొనుగోలుకు యాపిల్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఈ విషయమై ప్రస్తుతం టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ మధ్య చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ చర్చలు కొనసాగుతుండగానే..యాపిల్ ప్రస్తావన రావడంతో సదరు కంపెనీ మంగళవారం నాడు స్పందించింది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని తేల్చి చెప్పింది. కాగా.. మైక్రోసాఫ్ట్‌తో టిక్‌టాక్ డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 45 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. అంతకుమునుపే ఆయన టిక్‌టాక్‌ను బ్యాన్ చేయచ్చొంటూ పలు మార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ భవిత్యంపై అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2020-08-06T00:30:55+05:30 IST