అంబేడ్కర్‌ బాటలో పయనించాలి

ABN , First Publish Date - 2021-11-29T06:35:39+05:30 IST

దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ బాటలో పయనించాలి
పెద్దపడిశాలలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విప్‌ సునీత

 ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి 

పెద్దపడిశాలలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

గుండాల, నవంబరు 28: దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఖలీల్‌, ఎంపీపీ తాండ్ర అమరావతి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దార సైదులు, సర్పంచ్‌ పాల అబ్బులు, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ గడ్డమీది పాండరి, రాములు, శోభన్‌ పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..

పెద్దపడిశాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు అండెం సంజీవరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన 

మండలకేంద్రంతోపాటు మండలంలోని అనంతారం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.  

ఆలేరు రూరల్‌: కార్యకర్తల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆదివారం మండలంలోని మందనపల్లిలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్‌ తల్లి ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కోటగిరి పాండరి, ఉపసర్పంచ్‌ జంపాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-29T06:35:39+05:30 IST